UNHRC : ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై ప్రపంచం పాకిస్తాన్ నుండి నేర్చుకోవలసిన అవసరం లేదు..!!
మైనార్టీలను వేధిస్తున్న పాకిస్థాన్ ను దూషిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం నుంచి ప్రజాస్వామం, మానవ హక్కుల గురించి ప్రపంచం నేర్చుకోవల్సిన అవసరసం లేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి భారత్ కు తెలిపింది.
- Author : hashtagu
Date : 29-09-2022 - 7:10 IST
Published By : Hashtagu Telugu Desk
మైనార్టీలను వేధిస్తున్న పాకిస్థాన్ ను దూషిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం నుంచి ప్రజాస్వామం, మానవ హక్కుల గురించి ప్రపంచం నేర్చుకోవల్సిన అవసరసం లేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి భారత్ కు తెలిపింది. UNHRC 51వ సెషన్ లో భారతదేశ శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ సీమా పూజానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ చేస్తున్న అరాచకాలను ఆమె ఎత్తి చూపారు.
మతతత్వ సిద్ధాంతాలకు పునాది వేసిన పాకిస్థాన్ ఇప్పుడు..మత అసహనంపై ప్రపంచానికి అవగాహన కల్పించడం విడ్డూరంగా ఉందని సీమా పూజానీ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం నుంచి ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి ప్రపంచం నేర్చుకోవలసిన అవసరం లేదన్నారు. గ్లోబల్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడంలో పాకిస్థాన్ సహకారం ఎనలేనిదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. హిందూ, సిక్కులు, క్రైస్తవులను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్నట ఘటనలు పాకిస్తాన్ లో జరుగుుతన్నాయి. మైనార్టీలు బలవంతపు పెళ్లిళ్లకు గురవుతున్నట్లు తెలిపారు.