Internet Cables Cut : హౌతీల ఎటాక్.. సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం ?
Internet Cables Cut : యెమన్ దేశానికి చెందిన హౌతీ రెబల్స్ రెచ్చిపోతున్నారు.
- By Pasha Published Date - 04:19 PM, Tue - 27 February 24

Internet Cables Cut : యెమన్ దేశానికి చెందిన హౌతీ రెబల్స్ రెచ్చిపోతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ అమానవీయ దాడులను ఆపకుంటే ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్‌ను కట్ చేస్తామని వార్నింగ్స్ ఇస్తూ వచ్చిన హౌతీలు.. చెప్పినంత పని చేసినట్టుగా తెలుస్తోంది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు కీలకమైన సముద్రగర్భ కేబుళ్లలో నాలుగు ధ్వంసమయ్యాయని సమాచారం. అయితే ఇది హౌతీ రెబల్స్ పనేనా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్ అయిన కేబుళ్లలో భారత్-ఐరోపా మధ్య సేవలు అందించేవే అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుళ్లపై హౌతీలు దాడులు మొదలుపెట్టారనే అనుమానాలు సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
ఈ నాలుగు లైన్స్ కట్ ?
ఎర్ర సముద్రంలో హౌతీలు కట్ చేసినట్టుగా(Internet Cables Cut) చెప్పుకుంటున్న కేబుల్స్ వివరాలను ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం.. ‘ఏఏఈ-1 కేబుల్’ తూర్పు ఆసియా ప్రాంతాన్ని ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో లింక్ చేస్తుంది. చైనాను ఖతర్, పాకిస్థాన్ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది. యూరప్ ఇండియా గేట్‌వే (ఈఐజీ) కేబుల్.. దక్షిణ ఐరోపా ప్రాంతం మీదుగా ఈజిప్ట్, సౌదీ, జిబూటి, యూఏఈ, భారత్‌కు కమ్యూనికేషన్ సేవలు అందిస్తుంది. ఇక సీకామ్ కేబుల్.. ఐరోపా, ఆఫ్రికా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తుంది. సీకామ్-టాటా కమ్యూనికేషన్స్ కలిసి పనిచేస్తాయి.టీజీఎన్-ఈఏ కేబుల్.. ఇది 9,280 కిలో మీటర్ల పొడవైన అండసీ కేబుల్ సిస్టమ్. ఇది భారత్‌లోని ముంబయిని ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌తో కలుపుతూ, ఈజిప్ట్ మీదుగా వెళుతుంది.
Also Read : Electric Car: అరగంటలోనే ఫుల్ ఛార్జ్.. ఒక్క ఛార్జ్ తో 570 కిలోమీటర్ల ప్రయాణం?
- ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1858లో సముద్రంలో టెలిగ్రాఫ్ కేబుల్స్ వేశారు. అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కంపెనీ ఈ తీగలను వేసింది.
- ప్రస్తుతం సముద్రగర్భంలో 300కు పైగా కీలక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లైన్లు ఉన్నాయి. ఫోన్‌కాల్స్, రోజువారీ జరిగే బిలియన్ డాలర్ల కొద్దీ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్సాక్షన్స్, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే జరుగుతుంటాయి.
- ప్రపంచ కమ్యూనికేషన్లలో 90శాతానికి ఈ కేబుల్స్ మాత్రమే ఉపయోగపడుతున్నాయి. భారత్‌కు వివిధ ప్రాంతాలతో జరిగే కమ్యూనికేషన్లలో 50శాతం, ఖతర్‌కు 60శాతం, ఒమన్‌కు 70శాతం, యూఏఈకి 80శాతం, కెన్యాకు 90శాతం కేబుల్స్ ఈ మార్గం నుంచే వెళతాయి.
- ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ వంటి కీలక సేవలకు అంతరాయం కలుగుతుంది.
- ప్రపంచలోని ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 17శాతానికి సంబంధించిన కేబుల్స్ ఈజిప్ట్‌లోని సూయజ్, బాబ్-ఎల్-మండెప్ జలసంధుల మీదుగా ఐరోపా-ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి.
- ముఖ్యంగా యెమెన్-జిబూటీ, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పరిచారు.
- హౌతీలు డైవర్లు, నౌకలకు వాడే మైన్లను వినియోగించి ఇంటర్నెట్ కేబుల్స్‌ను ధ్వంసం చేసే అవకాశాలు ఉంటాయి.
- వేర్వేరు మార్గాల్లో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానించే ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. దీని వల్ల పెద్దగా సమస్య ఉండకపోవచ్చు.
- దెబ్బతిన్న ఇంటర్నెట్ కేబుల్స్‌ను సరి చేయడానికి కనీసం 8 వారాల సమయం పడుతుందని అంచనా.