Ukraine hurt the sentiments of Hindus: హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఉక్రెయిన్.. కాళీమాతను అగౌరవపరిచే విధంగా ట్వీట్?
ఏదేమైనా సరే మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే ఎవరు తట్టుకోరు.
- By Anshu Published Date - 07:34 PM, Sun - 30 April 23

Ukraine hurt the sentiments of Hindus: ఏదేమైనా సరే మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే ఎవరు తట్టుకోరు. ముఖ్యంగా హిందువులైతే అసలు తట్టుకోరు. వెంటనే ఫైర్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తాజాగా ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసింది.
రష్యాలో చమురు డిపో పై దాడి చేసిన తర్వాత అక్కడ పొగ వెలువడటంతో ఆ పొగ పై కాళీమాతను తలపించే విధంగా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో ను గుర్తుకు తెచ్చేలా ఫోటో షేర్ చేశారు. అంతేకాకుండా వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే క్యాప్షన్ తో స్కర్ట్ ధరించిన స్త్రీ బొమ్మను ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అది చూసిన భారతీయులు ఉక్రెయిన్ తీరుపై ఫైర్ అవుతున్నారు.
హిందువుల పవిత్ర దైవమైన కాళీమాతను అలా ఎగతాళి చేసి చూపించటంతో విస్తూపోయామని.. అవివేకం.. అజ్ఞానం అని అభ్యంతరమైన కంటెంట్ ని తీసేసి క్షమాపణలు చెప్పాలి అని.. అన్ని మతాలను గౌరవించాలి అని ఒక నెటిజన్ మండిపడ్డారు. ఇక మరికొంతమంది విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రి జయశంకర్ ను ట్యాగ్ చేసి.. ఈ విషయం పట్ల జోక్యం చేసుకోవాలని కోరారు.
భారతీయుల నుండి రకరకాలుగా కామెంట్లు రావడంతో.. వెంటనే ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే రీసెంట్గా సెవాస్టోపాల్ లోని రష ఇంధన నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ ఎటాక్ చేయగా.. దీంతో 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థం కలిగిన 10 కన్న ఎక్కువ చమురు ఉత్పత్తులను ధ్వంసం చేసినట్లు తెలిపింది ఉక్రెయిన్. దీంతో ఈ పేలుడు దాటికి పెద్ద పొగ మేఘం ఆకాశంలోకి వ్యాపించింది అని.. దాంతో డిఫెన్స్ శాఖ ఆ పొగమేఘాన్ని ఉపయోగించి కాళీమాతను పోలి ఉండేలా ఫోటో మార్కింగ్ చేసి ట్వీట్ చేసింది.