Secret Service Agent : తన ప్రాణాలు కాపాడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు ట్రంప్ బంపర్ ఆఫర్
గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ పట్టణంలో ట్రంప్(Secret Service Agent) పర్యటించారు.
- By Pasha Published Date - 05:00 PM, Thu - 23 January 25

Secret Service Agent : డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచీ అన్నీ సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ పేరు సీన్ కరన్(Sean Curran)కు ట్రంప్ పిలిచి మరీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటి ? ఎందుకా ఆఫర్ ఇచ్చారు ? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Maoist Setback : మావోయిస్టుల సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా ?
ట్రంప్‌పై హత్యాయత్నంతో కలకలం..
గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ పట్టణంలో ట్రంప్(Secret Service Agent) పర్యటించారు. అక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తూ ఆయనపై హత్యాయత్నం జరిగింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ చెవిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ట్రంప్ పక్కనే ఉన్న అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ పేరు సీన్ కరన్ (Sean Curran). అతడు సమయ స్ఫూర్తితో వ్యవహరించి ట్రంప్‌ను కాపాడాడు. సభా వేదికపై నుంచి ట్రంప్‌ను సేఫ్‌గా ఆస్పత్రికి తరలించాడు. అప్పట్లో ఈ దాడికి సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అయింది. అందులో ట్రంప్ పిడికిలి బిగించిన సీన్.. ట్రంప్ కుడివైపునే కళ్లజోడుతో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ కళ్లజోడు ధరించిన వ్యక్తే సీన్ కరన్. తనకు సాయం చేసిన వారిని మరువడం అనేది ట్రంప్ డిక్షనరీలో ఉండదు. అందుకే సీన్ కరన్‌ను పిలిపించిన ట్రంప్ ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఏకంగా అమెరికా సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ పదవిని నామినేట్ చేస్తానని చెప్పారట. అందుకు సీన్ కరన్ ఒకే చెప్పడంతో వెంటనే ట్రంప్ అధికారిక ఆదేశాలు జారీ చేశారట.
Also Read :Top 10 Non Veg States : నాన్ వెజ్ వినియోగంలో తెలుగు స్టేట్స్ ఎక్కడ ? టాప్- 10 రాష్ట్రాలివే
సీన్ కరన్ ఎవరు ?
సీన్ కరన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ట్రంప్ వ్యక్తిగత భద్రతా అధికారిగా వ్యవహరిస్తున్నారు. గతంలో మొదటిసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు.. ‘ప్రెసిడెన్షియల్ ప్రొటెక్టివ్ విభాగానికి’ సీన్ కరన్ సారథిగా నియమితులు అయ్యారు. మొత్తం మీద సీన్ కరన్‌కు అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌లో దాదాపు 23 ఏళ్ల అనుభవం ఉంది. తన వ్యక్తిగత భద్రతా అధికారిగా గత కొన్నేళ్లుగా పనిచేస్తుండటం, ఎన్నికల ప్రచారంలో తనను కాపాడాడనే కారణంతో సీన్ కరన్‌కు ట్రంప్ ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చారట.
ట్రంప్ ట్వీట్.. సీన్ కరన్‌పై ప్రశంసలు
ఈసందర్భంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. సీన్ కరన్ గొప్ప దేశభక్తుడని కొనియాడారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో తన ప్రాణాలను కాపాడేందుకు సీన్ కరన్ ప్రాణాలను ఫణంగా పెట్టాడన్నారు. గత కొన్నేళ్లుగా తన కుటుంబాన్ని కరన్ రక్షిస్తున్నట్లు చెప్పారు. అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌కు సారథ్యం వహించే సత్తా సీన్ కరన్‌కు ఉందన్నారు.