Trump : ఇండియా కు షాక్ ఇచ్చి పాక్ తో చేతులు కలిపిన ట్రంప్
Trump : పాకిస్థాన్(Pakistan)లో చమురు నిల్వలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశంతో డీల్ కుదుర్చుకున్నట్లు ట్రంప్ ట్వీట్ చేశారు
- By Sudheer Published Date - 08:07 AM, Thu - 31 July 25

భారత్‌పై 25% సుంకాలు విధించి గట్టి షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ (Trump ).. ఇప్పుడు మరో కీలక ప్రకటనతో రాజకీయ, వాణిజ్య వర్గాల్లో ఆందోళన నింపారు. పాకిస్థాన్(Pakistan)లో చమురు నిల్వలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశంతో డీల్ కుదుర్చుకున్నట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ డీల్‌పై ఆయన “ఎవరికి తెలుసు.. ఏదో ఒకరోజు వాళ్లు భారత్‌కు ఇంధనం విక్రయించొచ్చు?” అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవైపు భారత్‌ను తమ మిత్ర దేశంగా చెప్పుకుంటూనే, మరోవైపు మన దాయాది దేశమైన పాకిస్థాన్‌తో ఇలాంటి ఒప్పందం చేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
Kingdom Talk : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు అనేక విధాలుగా నష్టదాయకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సుంకాల భారం భారత్‌లోని పలు పరిశ్రమలపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు పాకిస్థాన్‌లో చమురు నిల్వల అభివృద్ధికి సహకరించడం ద్వారా, అమెరికా పాకిస్థాన్‌తో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఇది భవిష్యత్తులో భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా, వ్యూహాత్మక ప్రాధాన్యతను కూడా సంతరించుకుంటున్నాయి. పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు బలపడటం దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. భారత్‌కు అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న అమెరికా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.