World War III : మూడో ప్రపంచ యద్ధం తప్పదు..ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వంపై రష్యా బెదిరింపులు..!!
రష్యా తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై..తప్పుబడుతున్నా...తన దారి తనదే అంటన్నట్లు వ్యవహరిస్తోంది.
- By hashtagu Published Date - 06:55 AM, Fri - 14 October 22
రష్యా తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై..తప్పుబడుతున్నా…తన దారి తనదే అంటన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ప్రపంచ దేశాలను హెచ్చరించింది రష్యా. మూడో ప్రపంచ యుద్దం గురించి గతంలో ఎన్నోసార్లు హెచ్చరించిన రష్యా…మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది. ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం ఇచ్చినట్లయితే..మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా బెదిరిస్తోందని రష్యా భద్రతా మండలి అధికారి తెలిపారు. ఇలాంటి చర్య మూడో వరల్డ్ వార్ కు దారి తీస్తుందని కచ్చితంగా కైవ్ కు బాగా తెలుసని రష్యా పేర్కొంది.
నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం పర్యవసానాలకు పశ్చిమ దేశాలు అర్థం చేసుకున్నాయి. ఉక్రెయిన్ దరఖాస్తు ప్రచారంగా తాను భావిస్తున్నట్లు పుతిన్ స్నేహితుడు భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ డిప్యూటీగా ఉన్న వెనెడిక్టోవ్ అన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించేందుకు ఇలా చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యల వల్ల నాటో సభ్యదేశాలే కావాలని దాడిని కోరకుంటున్నాయన్నారు. ఈ అణు సంఘర్షణ వల్ల సామూహిక పాశ్చాత్య దేశాలే కాకుండా ఈ గ్రహం మీదున్న ప్రతి దేశాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుందన్నారు. ఆ పర్యవసానాలు మానవులకు వినాశకరంగా పరిగణిస్తాయని చెప్పారు.
సెప్టెంబర్ 30న నాటోలో ఫాస్ట్ ట్రాక్ సభ్యత్వం కోసం ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఆశ్చర్యపరిచే బీడ్ను ప్రకటించిన తర్వాత ఈ హెచ్చరిక వచ్చిందని డైలీ మెయిల్ పేర్కొంది. అయితే నాటోలో పూర్తి సభ్యత్వానికి 30మంది నాటో సభ్యుల నుంచి సమ్మతి అవసరం ఉంటుంది. కొన్ని దేశాలు దీనికి అడ్డుగా ఉన్నట్లు డైలీమెయిల్ తెలిపింది.
Tags
Related News
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హ్యారీ పోటర్ కోట ధ్వంసం
హ్యారీ పోటర్ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది.