Iceland: ఏకాకి దీవిలో ఒకే ఒక ఇల్లు.. చూడటానికి ఎగబడుతున్న టూరిస్టులు
చిన్నప్పటి నుంచి దీవుల గురించి వినుంటారు, చదివుంటారు. చుట్టూ నీరు, మధ్యలో భూభాగం. అందులో అందమైన చెట్లు, జంతువులు, అంతటా పచ్చదనం.
- By Nakshatra Published Date - 06:37 PM, Sun - 25 December 22
చిన్నప్పటి నుంచి దీవుల గురించి వినుంటారు, చదివుంటారు. చుట్టూ నీరు, మధ్యలో భూభాగం. అందులో అందమైన చెట్లు, జంతువులు, అంతటా పచ్చదనం. ఎన్నో సినిమాల్లో దీవులను చూపిస్తూనే ఉంటారు. పొద్దున లేస్తే ప్రకృతి, సముద్రం తప్పితే బాహ్య ప్రపంచంతో ఏ సంబంధాలూ ఉండవు. సముద్రంలో ఈత కొడుతూ, చేపలు లాంటి సీ ఫుడ్స్ ను తింటూ ప్రశాంతంగా రోజులు గడపాలని ఎంతోమంది కోరుకుంటారు. మాల్దీవులు, శ్రీలంక లాంటి ఎన్నో ప్రదేశాలకు అందుకే వెళ్తుంటారు.
ఇలా ఎన్నో దీవుల గురించి తెలుసుకున్నాం. కానీ ఏకాకి దీవి గురించి ఎప్పుడైనా విన్నారా? ఏకాకి దీవి, అందులో ఓ ఏకాకి ఇల్లు. ఆ దీవిలో ఉన్న ఆ ఏకాకి ఇంటి చుట్టూ అందమైన కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి. ఐస్ లాండ్ దక్షిణ తీరానికి సమీపంలో ఉన్న ఈ దీవి పేరే ఎల్లియోయే. ఐస్ లాండ్ లోని వెస్ట్ మానేయార్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇదివరకు ఇక్కడ కొంతమంది ఉండేవాళ్లు. చాన్నాళ్లుగా ఇక్కడ మనుషులెవరూ ఉండటం లేదు. ఈ దీవిలో ఉంటూ వస్తున్న చివరి మనుషులు 1930లో దీన్ని వదిలిపెట్టారు.
అప్పటి నుంచి ఈ దీవిలో మనుషులెవరూ ఉండటం లేదు. ఇక్కడి ఇళ్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. అయితే ఒక కోటీశ్వరుడు మాత్రం ఇక్కడ ఓ ఇల్లు కట్టాడని ప్రచారంలో ఉంది. ప్రళయం ముంచుకొచ్చినప్పుడు తలదాచుకోవాలనే ఉద్దేశంతోనే అతడు ఇల్లును నిర్మించుకున్నాడని రూమర్స్ ఉన్నాయి. నిజానికి ఈ ఇంటిని ఎల్లిమాయే హంటింగ్ అసోసియేషన్ చేపల్ని వేటాడే వాళ్లుకు స్థావరంగా ఉపయోగపడుతుందని అధికారిక సమాచారం. ఈ ఇంటికి మంచినీటి పైపులు, విద్యుత్ సరఫరా సౌకర్యాలేమీ లేవు. వర్షపు నీటిని సేకరించి, ఈ నీటిని ఉపయోగించుకునే సౌకర్యం మాత్రమే ఉంది.
పెరుగుతున్న పాపులారిటీ
ఖాళీగా ఉన్న ఈ దీవిలోకి చేరాలంటే తెలుసుకున్న చాలా మంది ఇక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐస్ లాండ్ కు చెందిన టూరిస్టు కంపెనీలు కూడా ఇక్కడ టూర్లు నిర్వహిస్తున్నాయి. అయితే బస చేసే సౌకర్యం లేకపోవడంతో పగలంతా ఇక్కడ ఎంత తిరిగినా, సాయంత్రానికి మళ్లీ వెస్ట్ మానేయర్ సిటీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ దీవికి రోజురోజుకీ పాపులారిటీ మరింతగా పెరుగుతోంది.
Related News
Volcano Video : బద్దలైన అగ్నిపర్వతం.. లావా ఎలా ఎగిసిపడిందో చూడండి
Volcano Video : ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్కు దక్షిణంగా ఉన్న అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం జరిగింది.