America : రోడ్డు ప్రమాదంలో TANA బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి..!!
అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడిక్కడే మరణించారు.
- By hashtagu Published Date - 09:15 AM, Tue - 27 September 22

అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు అక్కడిక్కడే మరణించారు. టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ 1995లో అమెరికా వెల్లారు. పీడియాట్రిక్ కార్డియోవాస్కులర్ గా పనిచేస్తే అక్కడే స్ధిరపడ్డారు. 2017 నుంచి తానా బోర్డులో ఆయన డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
శ్రీనివాస్ భార్య వాణి ఆదివారం తన కుమార్తెలను కాలేజీ నుంచి తీసుకువచ్చేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణీస్తున్న కారు ఓ వ్యాన్ ను బలంగా ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడే మరణించారు…ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన గురించి విన్న శ్రీనివాస్ షాక్ కు గురయ్యారు.