HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Talibans New Diktat Kitchens Must Be Windowless To Prevent Obscene Acts

Talibans New Diktat : వంటగది కిటికీలు టార్గెట్‌గా తాలిబన్ల పిచ్చి ఆర్డర్

ఈమేరకు డిజైనింగ్ ఉన్న కొత్త నిర్మాణ ప్రతిపాదనలకు మాత్రమే అనుమతులు  ఇవ్వాలని దేశ మున్సిపల్ అధికారులను తాలిబన్లు(Talibans New Diktat) ఆదేశించారు.

  • By Pasha Published Date - 11:45 AM, Mon - 30 December 24
  • daily-hunt
Talibans New Diktat Windowless Kitchens

Talibans New Diktat : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తమదైన స్టైల్‌లో అరాచక పాలనను నడిపిస్తున్నారు. వింత వింత ఆదేశాలు.. రాక్షస ఆర్డర్స్ ఇస్తూ దేశ ప్రజలను రాచిరంపాన పెడుతున్నారు. ప్రత్యేకించి మహిళలను వేధించే, ఇబ్బందిపెట్టే ఆర్డర్సే ఎక్కువగా జారీ చేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒక పిచ్చి ఆర్డర్‌ను తాలిబన్ల ప్రభుత్వం ఇచ్చింది.

Also Read :Vijay Vs DMK : “ప్రియమైన సోదరీమణులారా..” టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ ఎమోషనల్ లేఖ

తాలిబన్లు జారీ చేసిన కొత్త ఆర్డర్ అనేది ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్తగా నిర్మించే ఇళ్లకు సంబంధించినది. కొత్తగా కట్టే ఇళ్లల్లో నుంచి మహిళలు బయటివారికి కనిపించకుండా ఏర్పాట్లు ఉండాలని తాలిబన్లు ఆదేశించారు. ప్రత్యేకించి కొత్త ఇళ్లలో వంటగదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దన్నారు. ఒకవేళ వంట గదిలో కిటికీలు ఉంటే.. దాని నుంచి మహిళలు బయటికి కనిపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.  ఇంటి ఆవరణ చుట్టూ సాధ్యమైనంత ఎక్కువ ఎత్తులో ఫెన్సింగ్ ఉండేలా చూడాలని తాలిబన్లు కోరారు. దీనివల్ల ఇంటి ఆవరణలో మహిళలు తిరిగినా.. బయటికి కనిపించరని తెలిపారు.  మహిళలు తాగునీటిని బిందెలలో తీసుకెళ్లేందుకు బావుల వద్దకు వచ్చినప్పుడు.. ఇతరులకు కనిపించే అవకాశం ఉందని తాలిబన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు నీళ్లు తీసుకెళ్లే చేతి పంపులు, బావుల ఏరియాలలోనూ ఫెన్సింగులు ఏర్పాటు చేయాలని తాలిబన్లు నిర్దేశించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఒక పోస్టు పెట్టారు. ఈమేరకు డిజైనింగ్ ఉన్న కొత్త నిర్మాణ ప్రతిపాదనలకు మాత్రమే అనుమతులు  ఇవ్వాలని దేశ మున్సిపల్ అధికారులను తాలిబన్లు(Talibans New Diktat) ఆదేశించారు.

Also Read :Pushpa 2 Collections : ‘పుష్ప 2 ది రూల్’ 25వ రోజు ఎన్ని కలెక్షన్స్ సాధించిందంటే..

ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లోని జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై బ్యాన్ అమల్లో ఉంది. బాలికలను మిడిల్‌ స్కూల్‌, హైస్కూల్‌ విద్యకు కూడా తాలిబన్లు దూరం చేశారు. పలు రంగాల్లో మహిళలు జాబ్ చేయడంపైనా బ్యాన్ విధించారు. మహిళలు ఆటలాడటంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Afghanistan
  • Kitchens Windows
  • taliban
  • Talibans
  • Talibans New Diktat
  • Windowless Kitchens

Related News

A massive earthquake shook Afghanistan, killing more than 250 people

Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

బాధితుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కునార్ ప్రావిన్స్‌లోని పలు జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

    Latest News

    • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

    • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

    • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

    • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    Trending News

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

      • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd