Taliban : విడాకులు చెల్లవ్, తాలిబన్ల `ఉమెన్స్ డే` హుకుం!
తాలిబన్ల (Taliban) పాలనలో అఫ్గానిస్థాన్ మహిళలు(Women) ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు
- By CS Rao Published Date - 03:14 PM, Wed - 8 March 23

తాలిబన్ల (Taliban) పాలనలో అఫ్గానిస్థాన్ మహిళలు(Women) ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భర్తల చేతిలో హింసకు గురై, విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వారితోనే కలిసి జీవించాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అఫ్గానిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబాన్‌లు పలు అంశాల్లో ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళల చదువు, ఉద్యోగాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. విద్యాసంస్థల మూసివేత మొదలు.. బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడంపైనా నిషేధం విధిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మహిళల విడాకులను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో భర్తల చేతిలో వేధింపులకు గురై దూరంగా ఉంటున్న మహిళలను, తిరిగి వారి మాజీ భర్తల వద్దకే వెళ్లి జీవించాలని ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.
తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్ మహిళలు (Taliban)
అఫ్గాన్‌లో (Taliban)అమెరికా బలగాలు ఉన్న సమయంలో అక్కడి మహిళలకు(Women) కొంత స్వేచ్ఛ లభించినట్లు కనిపించింది. కానీ, తాలిబన్లు వచ్చిన తర్వాత అవన్నీ చరిత్రలో కలిసిపోయాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారిపైనా తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో చట్టపరంగా విడాకులు తీసుకున్న మహిళలను మాజీ భర్తతో కలిసిపోవాలంటూ తాలిబాన్ కమాండర్లు ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. గృహహింసకు వ్యతిరేకంగా పోరాడటం, చట్టపరంగా విడాకులు తీసుకున్నప్పటికీ వారి నుంచి దూరంగా వెళ్లే అవకాశం లేకపోవడం వంటి సవాళ్లు అఫ్గాన్ మహిళలు ఎదుర్కొంటున్నట్లు ఐరాస కూడా ఇటీవల పేర్కొంది.
విడాకులు తీసుకున్న మహిళలు మాజీ భర్తలతోనే కలిసి ఉండేలని
గతంలో విడాకులు తీసుకున్న మహిళలు(Women) వారి మాజీ భర్తలతోనే కలిసి ఉండేలని ఒత్తిడి తెస్తున్నారనడంపై తాలిబాన్ (Taliban)ప్రతినిధులు స్పందించారు. అటువంటి ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని.. అనంతరం షరియా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తాలిబాన్ అధికార ప్రతినిధి ఇనాయతుల్లా మీడియాకు వెల్లడించారు. గతంలో తీసుకున్న విడాకులను ఆమోదిస్తారా అన్న ప్రశ్నకు ఇది ముఖ్యమైన, సంక్లిష్టమైన సమస్య అని సమాధానం దాటవేయడం గమనార్హం.
Also Read : Hunger India : ఆకలి కేకల భారత్, మోడీ హయాంలో రెట్టింపు
తాలిబాన్ పాలన ఆఫ్ఘన్ మహిళలు మరియు బాలికలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపిందని, కొత్త పరిశోధన షోలు, హ్యూమన్ రైట్స్ వాచ్ మరియు శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీ లోని మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘజ్నీ ప్రావిన్స్‌లో తాలిబాన్ నియంత్రణలోకి వచ్చినప్పటి నుండి ఈ సంస్థలు మహిళల పరిస్థితులను పరిశీలించాయి.
ఆఫ్ఘనిస్తాన్ వేగంగా పెరుగుతున్న మానవతా సంక్షోభం
ఘజ్నీ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించడానికి కొన్ని రోజుల ముందు, తాలిబాన్ హక్కులను ఉల్లంఘించే విధానాలను విధించింది. మహిళలు మరియు బాలికల ఆరోగ్యం మరియు విద్యపై భారీ అడ్డంకులు సృష్టించింది, ఉద్యమ స్వేచ్ఛను తగ్గించింది. ఆఫ్ఘనిస్తాన్ వేగంగా పెరుగుతున్న మానవతా సంక్షోభం ఈ దుర్వినియోగాలను మరింత తీవ్రతరం చేస్తుంది. తాలిబాన్ టేకోవర్ తరువాత, మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది. ధరలు పెరగడం, సహాయ కోతలు, ద్రవ్య సంక్షోభం మరియు మాజీ దాత దేశాలు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ప్రేరేపించిన నగదు కొరత కారణంగా చాలా మంది జనాభాకు ఆహారం, నీరు అందుబాటులో లేకుండా పోయాయి.
Also Read : Modi: కర్ణాటకలో మోడీ పర్యటన… ఎన్నికల వేళ కాంగ్రెస్‌పై సెటైర్లు!

Related News

Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు ఆ దేశ మహిళలపై విపరీతమైన ఆంక్షలు (Taliban bans) విధిస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలు, పని ప్రదేశాల్లో మహిళలను నిషేధించిన తాలిబన్లు, తాజాగా మహిళలపై మరో నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన బాలికలు, మహిళలు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించింది.