Sunita Williams : స్పేస్‌లో ఏడాది ఉండాల్సి వస్తుందనుకోలేదు.. ఫ్యామిలీని మిస్ అవుతున్నా : సునితా విలియమ్స్
తాను ఏడాది పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదని సునితా విలియమ్స్(Sunita Williams) అన్నారు.
- By Pasha Published Date - 10:02 AM, Sat - 14 September 24

Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్‌మోర్ ఈ ఏడాది జూన్ 5 నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోనే ఉన్నారు. వారితో నాసా తాజాగా న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అందులో సునితా విలియమ్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read :Pope Francis : ట్రంప్, కమల ‘‘మానవ జీవిత’’ వ్యతిరేకులు : పోప్ ఫ్రాన్సిస్
తాను ఏడాది పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదని సునితా విలియమ్స్(Sunita Williams) అన్నారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగి వెళ్లడం లేట్ అవుతుందని మాత్రమే తాను భావించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషనులో తాను సంతోషంగానే ఉంటున్నానని తెలిపారు. మొదటి నుంచీ అంతరిక్షంలో గడపడాన్ని తాను ఎంజాయ్ చేస్తానన్నారు. కానీ కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నాననే బాధ మాత్రం ఉందన్నారు. మరే ఇబ్బందీ తనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషనులో లేదని చెప్పారు.
Also Read :Hindi Diwas 2024: హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ఈ రోజు ప్రాముఖ్యత ఇదే..!
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ తాను, తన తోటి వ్యోమగామి (బుచ్ విల్‌మోర్) అంతరిక్షంలోనే ఓటు వేయబోతున్నట్లు సునితా విలియమ్స్ పేర్కొన్నారు. అమెరికా పౌరులుగా ఓటు వేయడం తమ బాధ్యత అని తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల కోసం ఇప్పటికే తాము అభ్యర్థన పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవైపు ప్రొఫెషనల్ మిషన్‌లో ఉన్నప్పటికీ.. దేశ పౌరులుగా తమ బాధ్యతను మర్చిపోలేమని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండలేమన్నారు. కాగా, సునితా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు అంతరిక్షానికి వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సాంకేతికంగా దెబ్బతింది. దీంతో దానికి తాత్కాలిక మరమ్మతు చేసి.. ఆటో పైలట్ విధానంలో భూమికి తీసుకొచ్చారు. అది న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపాలు ఉండటంతో వ్యోమగాములు లేకుండానే దాన్ని భూమికి రప్పించారు.