Cigarettes Ban : త్వరలో సిగరెట్లపై బ్యాన్.. కసరత్తు మొదలుపెట్టిన రిషి
Cigarettes Ban : త్వరలోనే బ్రిటన్ లో సిగరెట్ల వినియోగంపై బ్యాన్ విధించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
- By Pasha Published Date - 07:39 AM, Sat - 23 September 23

Cigarettes Ban : త్వరలోనే బ్రిటన్ లో సిగరెట్ల వినియోగంపై బ్యాన్ విధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. యువత, విద్యార్థులకు సిగరెట్లను విక్రయించకుండా కట్టడి చేసే చర్యలను అమల్లోకి తేవాలనే యోచనతో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది న్యూజిలాండ్ ప్రకటించిన సిగరెట్ బ్యాన్ చట్టాల మాదిరిగానే.. బ్రిటన్ లోనూ చట్టాలను రూపకల్పన చేయాలని రిషి యోచిస్తున్నారని తెలుస్తోంది. 2009 సంవత్సరం జనవరి 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడంపై నిషేధం విధిస్తూ గత సంవత్సరం న్యూజిలాండ్ చట్టం చేసింది. అదేవిధమైన చట్టాన్నితీసుకొచ్చే దిశగా సునాక్ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈవిధంగా ధూమపాన కట్టడి చర్యలను చేపడుతూ.. 2030 నాటికి బ్రిటన్ ను ధూమపాన రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also read : Gold Rates: వరసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
ఉచిత వేప్ కిట్‌ల పంపిణీ, గర్భిణులు ధూమపానం చేయకుండా ప్రోత్సహించేలా వోచర్ పథకం అమలుకు సంప్రదింపులు జరుపుతున్నామని యూకే ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ముందు సునాక్ బృందం ధూమపాన నిషేధానికి చర్యలను అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఇక అత్యంత ప్రమాదకర ఇ-సిగరెట్ల నియంత్రణ చర్యల్లో భాగంగా పిల్లలకు ఉచితంగా వేప్ కిట్ల శాంపిళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మే నెలలోనే రిషి ప్రభుత్వం (Cigarettes Ban) ప్రకటించింది.