Suchata Chuangsri : నా సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న మిస్ వరల్డ్ 2025 సుందరి
Suchata Chuangsri : "ఏది ఎప్పుడూ సులువు కాదు, అలసటగా అనిపించినా, క్షణం కూడా నమ్మకాన్ని వదలకుండా ముందుకు సాగితే మీరు మీ గమ్యాన్ని చేరతారు" అని స్పష్టం
- By Sudheer Published Date - 09:41 AM, Sun - 1 June 25

2025 మిస్ వరల్డ్ (Miss World 2025) కిరీటాన్ని థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ (Suchata Chuangsri)గెలుచుకొని, తన దేశానికి తొలిసారి ఈ గౌరవాన్ని తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో ఆమె విజేతగా నిలవడం విశేషం. విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. “పట్టుదల, దృఢ నిశ్చయం నా విజయ రహస్యాలు. ఆత్మవిశ్వాసం, కరుణ నా జీవితానికి ఆధారం” అని పేర్కొన్నారు.
Temple Traditions: గుడిలో గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా??
తన లక్ష్యాన్ని నమ్మడం, స్వీయ విలువలను గౌరవించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని ఓపల్ భావోద్వేగంతో మాట్లాడింది. “ఏది ఎప్పుడూ సులువు కాదు, అలసటగా అనిపించినా, క్షణం కూడా నమ్మకాన్ని వదలకుండా ముందుకు సాగితే మీరు మీ గమ్యాన్ని చేరతారు” అని స్పష్టం చేసింది. ఆమె ధరించిన తెలుపు రంగు గౌను ‘హీలింగ్’ మరియు ‘బలం’కు ప్రతీకగా అని తెలిపింది.
Miss World 2025: మిస్ వరల్డ్-2025 విజేతగా 24 ఏళ్ల థాయ్‌లాండ్ సుందరి.. ఆమె ప్రైజ్ మనీ ఎంతంటే?
ఈ ఫైనల్ పోటీలో ఇథియోపియాకు చెందిన హసెట్ డెరెజీ అడ్మాసు రన్నరప్‌గా నిలవగా, భారత్ తరఫున పోటీలో పాల్గొన్న నందిని గుప్తా (Nandini Gupta) టాప్ 8కు కూడా ఎంపిక కాలేదు. దీంతో భారత ప్రేక్షకుల్లో నిరాశ నెలకొంది. గత ఏడాది ముంబయిలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ ఇప్పటివరకు ఆరు సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకోగా, చివరిసారిగా 2017లో మానుషి చిల్లర్ ఈ ఘనతను సాధించింది.