HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Stranded Astronaut Sunita Williams Face Painful Return Baby Feet Bone Density Loss

Sunita Williams : 19న భూమికి సునితా విలియమ్స్.. ఈ ఆరోగ్య సమస్యల గండం

సునితా విలియమ్స్(Sunita Williams) మార్చి 19న భూమికి తిరిగొచ్చాక  "బేబీ ఫుట్" సమస్య తలెత్తే రిస్క్ ఉంది. 

  • By Pasha Published Date - 10:18 AM, Sun - 16 March 25
  • daily-hunt
Astronaut Sunita Williams Baby Feet Bone Density Loss Health Problems

Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు  8 రోజుల స్పేస్ మిషన్ కోసం వెళ్లి దాదాపు 9 నెలల పాటు అక్కడే ఇరుక్కుపోయారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే  గడిపారు.  వారిని భూమికి తీసుకొచ్చేందుకు గత శుక్రవారం రోజు అమెరికా నుంచి వెళ్లిన ‘నాసా-స్పేస్ ఎక్స్’ సంయుక్త   ‘క్రూ-10 మిషన్’ ఐఎస్ఎస్‌కు ఇవాళ చేరుకుంది. అందులోని వ్యోమగాములు.. ఐఎస్ఎస్‌లోని సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తీసుకొని మార్చి 19కల్లా అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్  కానున్నారు. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపినందుకు వివిధ ఆరోగ్య సమస్యలు సునితను చుట్టుముట్టాయట. ఆమె భూమికి తిరిగొచ్చాక ఆ సైడ్ ఎఫెక్టులు కనిపిస్తాయట. వివరాలివీ..

Also Read :Saudi Arabia T20 : గ్రాండ్ శ్లామ్ తరహాలో టీ20 లీగ్.. రూ.4,300 కోట్లతో సౌదీ రెడీ

సునితకు బేబీ ఫుట్.. ఏమిటిది ?

  • సునితా విలియమ్స్(Sunita Williams) మార్చి 19న భూమికి తిరిగొచ్చాక  “బేబీ ఫుట్” సమస్య తలెత్తే రిస్క్ ఉంది.
  • సునిత 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపారు.  నేలపై కాలు పెట్టలేదు. అందుకే భూమిపైకి తిరిగొచ్చాక, నడిచేందుకు ఆమె తడబడే అవకాశం ఉంది. నేలపై అడుగు మోపేందుకు పాదాలు మునుపటిలా ఈజీగా సహకరించకపోవచ్చు.
  • అంతరిక్షంలో  సుదీర్ఘకాలం ఉంటే బేబీ ఫుట్ సమస్య వస్తుంది. దీనివల్ల పాదాలు.. శిశువు పాదాలలాగా మృదువుగా మారుతాయి. వాటితో నడవడం కష్టంగా అనిపిస్తుంది.
  • భూమిపై నడుస్తున్నప్పుడు.. మన పాదాలు గురుత్వాకర్షణ, ఘర్షణ రూపంలో చాలా నిరోధకతను ఎదుర్కొంటాయి. ఫలితంగా మన అరికాళ్లపై ఉండే చర్మం మందంగా తయారవుతుంది. అవి మనకు అసౌకర్యం, నొప్పి నుంచి రక్షణ కల్పిస్తాయి.
  • నెలల తరబడి అంతరిక్షంలో గడిపితే అరికాళ్లపై ఉండే గట్టి చర్మం తొలగిపోతుంది. ఫలితంగా  పాదాలు మృదువుగా మారుతాయి. అరికాళ్లపై గట్టి చర్మం వచ్చేందుకు కొన్ని వారాల నుంచి నెలల టైం పడుతుంది.
  • పరిస్థితి మెరుగుపడే వరకు సునితా విలియమ్స్2కు నడక అసౌకర్యంగా, బాధ కలిగించేదిగా ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య సమస్యలు ఇవీ..

  • అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. దీర్ఘకాలం అక్కడ ఉండటం వల్ల వ్యోమగాముల ఎముకల సాంద్రత గణనీయంగా తగ్గుతుంది.
  • కండరాలు బలహీనపడతాయి.
  • వ్యోమగాముల శరీరంలో రక్తం మోతాదు కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వారి శరీరంలోని గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పంప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా గుండె చాలా తక్కువగా కష్టపడాల్సి వస్తుంది.
  • వ్యోమగాముల శరీరంలో రక్తం ప్రవహించే విధానం కూడా మారుతుంది.
  • శరీరంలోని ద్రవాలు పేరుకుపోయి కనుబొమ్మల ఆకారం మారుతుంది. కంటిచూపు బలహీనపడుతుంది. చాలా మంది వ్యోమగాములు అంతరిక్షంలో కళ్ళజోడు ధరించి కనిపించడానికి ఇదే కారణం.
  • అంతరిక్షంలో  సుదీర్ఘ కాలం గడపడం వల్ల వ్యోమగాములపై రేడియేషన్‌ ప్రభావం  ఉంటుంది. భూమి అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు, సూర్యుడి నుంచి వచ్చే సౌర అయస్కాంత కణాలు, గెలాక్సీ కాస్మిక్ కిరణాల ప్రభావం వ్యోమగాములపై ఉంటుంది.

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 16 నుంచి 22 వరకు రాశిఫలాలను తెలుసుకోండి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astronauts
  • Baby Feet
  • Bone Density Loss
  • Butch Wilmore
  • Sunita Williams
  • US Astronauts

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd