Nobel Prize : కొరియా రచయిత్రికి నోబెల్ సాహిత్య బహుమతి
గత సంవత్సరం నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెకు నోబెల్ బహుమతిని(Nobel Prize) అందజేశారు.
- By Pasha Published Date - 05:47 PM, Thu - 10 October 24

Nobel Prize : మానవ జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, విషాదాలను గద్య కవిత్వ రూపంలో కళ్లకు కట్టేలా రచనలు చేస్తున్నందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు విశేష గుర్తింపు లభించింది. 2024 సంవత్సరానికిగానూ ఆమెను నోబెల్ సాహిత్య బహుమతికి ఎంపిక చేశారు.ఈవిషయాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ ప్రకటించింది. గత సంవత్సరం నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెకు నోబెల్ బహుమతిని(Nobel Prize) అందజేశారు.
Also Read :Vettaiyan Review In Telugu: వేట్టయన్ – ది హంటర్ రివ్యూ & రేటింగ్
రేపు (శుక్రవారం రోజు) నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. చివరగా అక్టోబర్ 14న ఎకానమిక్స్‌లో నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరిట వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి ఈ అవార్డులను అందిస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నుంచి ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 10లక్షల డాలర్ల నగదును అందిస్తారు. ఈ పురస్కారాలను డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు.
Also Read :One Nation One Election : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మాకొద్దు.. కేరళ అసెంబ్లీ సంచలన తీర్మానం
ఈసారి నోబెల్స్ ఎవరికి అంటే..
- ఇప్పటివరకు నోబెల్స్‌కు ఎంపికైన వారి వివరాల్లోకి వెళితే.. కెమిస్ట్రీ విభాగంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్ ప్రైజ్ వరించింది. డేవిడ్ బేకర్‌కు కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్, ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌లో డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్‌లకు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్‌ను అనౌన్స్ చేశారు.
- భౌతికశాస్త్రంలో చేసిన కృషికిగానూ జాన్ జే హాప్‌ఫీల్డ్, జియోఫ్రీ ఈ హింటన్‌లను నోబెల్ ప్రైజ్ వరించింది.
- విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు ఈసారి వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్‌ను అనౌన్స్ చేశారు. మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు వీరిద్దరికి నోబెల్ ఇచ్చారు.