Bomb Cyclone: అమెరికాలో భయాంనక దృశ్యాలు.. భయపెడుతోన్న బాంబ్ సైక్లోన్
అగ్రరాజ్యం అమెరికాన్ని బాంబ్ సైక్లోన్ భయపెడుతోంది. మంచు తుఫాన్ అమెరికా ప్రజలను వణికిస్తోంది. మంచు తుపాన్ తీవ్రంగా ప్రభావం చూపిస్తుండటంతో.. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు.
- By Anshu Published Date - 09:49 PM, Sun - 25 December 22

అగ్రరాజ్యం అమెరికాన్ని బాంబ్ సైక్లోన్ భయపెడుతోంది. మంచు తుఫాన్ అమెరికా ప్రజలను వణికిస్తోంది. మంచు తుపాన్ తీవ్రంగా ప్రభావం చూపిస్తుండటంతో.. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నాయి. మంచు తుఫాన్ ప్రభావంతో క్రిస్మస్ పండుగ వేడుకలను కూడా రద్దు చేసుకున్నారు. దాదాపు 13 రాష్ట్రాల్లో మంచు తుఫాన్ తీవ్రంగా ఉంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు కూడా పెట్టడం లేదు.
మంచు రోడ్లపై భారీగా పేరుకుపోయింది. దీంతో అమరికాలో 5,700 విమానాలను రద్దు చేశారు. మంచు తపాన్ కారణంగా మంచు రోడ్లను కప్పేయడంతో అధికారులు రోడ్లను మూసివేశారు. అమెరికాలో మంచు తుఫాన్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయాంనకంగా మారాయి. ఈ భయానక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచు తుఫాన్ కారణంగా వాహనాలు కూడా రోడ్లపై జారిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మంచు తుఫాన్ ప్రభావంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 60 శాతం మంది ప్రజలకు మంచు ప్రభావం పడినట్లు చెబుతున్నారు. మరిగే నీటిని గాల్లోకి విసిరితే వెంటనే నీళ్లు మంచులా మారిపోతున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది. ఇప్పటివరకు మంచు తుఫాన్ వల్ల 19 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.
మంచు తుఫాన్ వల్ల ప్రాణనష్టంనే కాకుండా ఆస్తి నష్టం కూడా పెద్ద మొత్తంలో జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గట్టిగా గాలి పీల్చినా లేదా మాట్లాడిన సరే చలికి తెమడ పట్టేసి ప్రాణాల మీదకు వస్తున్నట్లు చెబుతున్నారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. బాంబ్ సైక్లోన్ ప్రభావం తగ్గేలా కనిపించడం లేదు