HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Russias Supreme Court Bans The Lgbt Movement As Extremist

LGBT – Extremist : ఎల్జీబీటీ కార్యకర్తలు తీవ్రవాదులే.. సంచలన తీర్పు

LGBT - Extremist : లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (LGBT)ల గుర్తింపుపై రష్యా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

  • Author : Pasha Date : 01-12-2023 - 12:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lgbt Extremist
Lgbt Extremist

LGBT – Extremist : లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (LGBT) సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలపై రష్యా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. LGBT సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలను ‘‘తీవ్రవాదులు’’గా పేర్కొనాలని దేశ అధికార యంత్రాంగానికి న్యాయస్థానం నిర్దేశించింది. ‘‘అంతర్జాతీయ LGBT సామాజిక ఉద్యమం’’పై బ్యాన్ విధించమని కోరుతూ రష్యా న్యాయశాఖ నుంచి వచ్చిన అభ్యర్థనకు  ఆమోదం తెలిపామని సుప్రీంకోర్టు ప్రిసైడింగ్ న్యాయమూర్తి ప్రకటించారు.  ప్రకృతి విరుద్ధమైన లైంగిక సంబంధాలను ప్రోత్సహించడంపై, లింగమార్పిడి శస్త్రచికిత్సలపై ఇప్పటికే రష్యా ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ చర్యలకు కొనసాగింపుగానే తాజాగా రష్యా సుప్రీంకోర్టు నుంచి పై ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇకపై రష్యాలో నిరసనలకు దిగే స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధుల అరెస్టులు పెరగొచ్చని భావిస్తున్నారు. వారిపై కేసుల నమోదును కూడా పోలీసులు పెంచనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

స్త్రీ, పురుష లింగాలు తప్ప ఇతర  డజన్ల కొద్దీ లింగాల వారిని గుర్తించడానికి తాము సిద్ధంగా లేమని రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో చాలాసార్లు తేల్చి చెప్పారు. ఇతర లింగాల వారి హక్కుల గురించి రష్యాపై ఒత్తిడి పెంచే హక్కు పశ్చిమ దేశాలకు కానీ, ఇతర సంస్థలకు కానీ లేదని స్పష్టం చేశారు. రోడ్లపై అలాంటి లింగాల వారి ఆగడాలను ఉపేక్షించబోమని ఆయన చెప్పారు. 2024 మార్చిలో జరిగే రష్యా అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు పుతిన్ రెడీ అవుతున్నారు. వాటిలోనూ గెలిస్తే.. ఆయన మరో ఆరేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశాన్ని(LGBT – Extremist) దక్కించుకుంటారు.

Also Read: Gaza Truce Expired : మళ్లీ యుద్ధమేనా.. ఇజ్రాయెల్ – హమాస్ ‘కాల్పుల విరమణ’ డీల్ క్లోజ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • LGBT - Extremist
  • LGBT Ban
  • russia
  • Supreme Court

Related News

    Latest News

    • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

    • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

    • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

    • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

    • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd