HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Russian Missiles Target More Than 40 Ukraine Cities

Ukraine: ఉక్రెయిన్‌పై మ‌రోసారి ర‌ష్యా క్షిప‌ణులు దాడి..!

రష్యా క్షిపణులు 40కి పైగా ఉక్రెయిన్‌ నగరాలు, పట్టణాలపై దాడి చేశాయని అధికారులు గురువారం తెలిపారు.

  • Author : Gopi Date : 13-10-2022 - 3:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Russia- Ukraine War
Russia- Ukraine War

రష్యా క్షిపణులు 40కి పైగా ఉక్రెయిన్‌ నగరాలు, పట్టణాలపై దాడి చేశాయని అధికారులు గురువారం తెలిపారు. ఉక్రెయిన్‌కు సహాయం చేయడం ద్వారా పశ్చిమ దేశాలు వివాదానికి ప్రత్యక్ష పక్షం అని సూచించిన రష్యా తన వైఖరిని మ‌రోసారి పునరావృతం చేసింది. ఉక్రెయిన్‌ను NATOలో చేర్చుకోవడం మూడవ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించగలదని హెచ్చరించింది. “అటువంటి చర్య మూడవ ప్రపంచ యుద్ధానికి హామీ ఇవ్వగలదని కైవ్‌కు బాగా తెలుసు” అని రష్యన్ ఫెడరేషన్ భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్ వెనెడిక్టోవ్ గురువారం ఓ వార్తా సంస్థతో అన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాస్కోలో నాలుగు పాక్షికంగా ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న త‌ర్వాత‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సెప్టెంబర్‌ చివరిలో NATO సైనిక కూటమి ఫాస్ట్-ట్రాక్ సభ్యత్వం కోసం ఆశ్చర్యకరమైన బిడ్‌ను ప్రకటించారు. గత 24 గంటల్లో రష్యా క్షిపణులు 40కి పైగా స్థావరాలను తాకగా, ఉక్రెయిన్ వైమానిక దళం 25 రష్యా లక్ష్యాలపై 32 దాడులు నిర్వహించిందని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు.

పుతిన్‌ కలల ప్రాజెక్టు కెర్చ్‌ వంతెన ధ్వంసమైన తర్వాతి రోజే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 84 క్షిపణులతో విరుచుకుపడింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం సమీపంలో కూడా దాడి జరిగినట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా కీవ్‌తోపాటు జైటోమిర్‌, ఖెల్నిట్స్కీ, డెనిప్రో, ల్వీవ్‌, టెర్నోపిల్‌ నగరాలపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 20 మందికి పైగా మరణించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • russia
  • Russia-Ukraine War
  • ukriane
  • ukriane crisis

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Here are the 4 reasons behind Russia's massive attack on Ukraine.

    Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd