Harvard Medical School: వయస్సును వెనక్కి తీసుకొస్తామంటున్న నిపుణులు.. సాధ్యమయ్యే పనేనా?
గడిచిన కాలాన్ని, గడిచిపోయిన వయసుని వెనక్కి తీసుకురావడం అన్నది జరగని పని అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా
- By Anshu Published Date - 04:50 PM, Mon - 17 July 23

గడిచిన కాలాన్ని, గడిచిపోయిన వయసుని వెనక్కి తీసుకురావడం అన్నది జరగని పని అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము. గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం అయిపోయిన వయసులోకి మళ్ళీ వెళ్లడం లాంటి ఘటనలు ఎక్కువగా మనం సినిమాలలోనే చూస్తూ ఉంటాం. అవి కేవలం సినిమాలకే పరిమితం అవుతాయని చెప్పవచ్చు. వాస్తవంలోకి వచ్చేసరికి అంత సాధ్యం కాదన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ విషయంపై ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.
అందులో భాగంగా గడచి పోయిన వయసును మాత్రం వెనక్కి తిప్పగలం అంటున్నారు అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన పరిశోధకులు. అదెలా అంటే.. కాలం, వయసు ఒకసారి దాటిపోతే తిరిగి రావు అన్నది అక్షర సత్యం. కాలం విషయం అలా ఉంచితే, వయసును మాత్రం మేం వెనక్కి తిప్పగలం అంటున్నారు అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు. ఈ మేరకు అటు చిట్టెలుకలు, ఇటు మనుషుల కణాల్లో వయసును అనేక సంవత్సరాలు వెనక్కి తిప్పే సామర్థ్యం కలిగిన ఆరు రకాల రసాయనాల మిశ్రమ పానీయాన్ని కనుగొన్నామని వారు వివరించారు. జన్యు చికిత్స ద్వారా పిండ జన్యువులను క్రియాశీలం చేసి వయసును వెనక్కి తిప్పడం సాధ్యమే.
కాక్‌టెయిల్ లో వినియోగించే రసాయనాల్లో చాలా వరకూ మనిషిలోని శారీరక, మానసిక రుగ్మతల్ని తొలగించేవే ఉన్నాయి. కంటి నరాలు, మెదడు కణజాలం, మూత్రపిండాలు, కండరాలపై కాక్ టెయిల్ అద్భుతంగా పనిచేసింది. చిట్టెలుకల్లో జీవనకాలం గణనీయంగా పెరిగింది. కోతుల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయి. వచ్చే ఏడాది కల్లా మనుషులపై పూర్తిస్థాయిలో ప్రయోగాలను ప్రారంభించే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. త్వరలోనే మనిషి వయసు వెనక్కి తిప్పే సాంకేతికత కూడా అందుబాటులోకి వస్తుందన్నమాట.