Unstoppable Missile : పుతిన్ బ్రహ్మాస్త్రం ‘శాటన్- 2’.. ఈవారంలోనే టెస్ట్ ?
Unstoppable Missile : ప్రపంచంలోనే అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి ‘శాటన్- 2’ను ఈనెలాఖరులోగా రష్యా టెస్ట్ చేయబోతోంది.
- By Pasha Published Date - 07:54 AM, Wed - 22 November 23
Unstoppable Missile : ప్రపంచంలోనే అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి ‘శాటన్- 2’ను ఈనెలాఖరులోగా రష్యా టెస్ట్ చేయబోతోంది. రష్యా దక్షిణ ధ్రువ ప్రాంతంలో దీన్ని టెస్ట్ చేయబోతున్నారు. సైబీరియాలోని క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో శాటన్-2 మిస్సైల్ టెస్ట్ జరుగుతుందని అంటున్నారు. ఈ మిస్సైల్ ఎంత పవర్ ఫుల్ అంటే.. గంటకు 15,880 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
Also Read: IND vs AUS Head to Head: ఆసీస్ తో టీ ట్వంటీ సిరీస్.. హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ?
ఈ భారీ క్షిపణి బరువు 208 టన్నులు. 14 అంతస్తుల టవర్ బ్లాక్ అంత పెద్ద సైజులో ఉంటుంది. ఇది న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా మోసుకెళ్లగలదు. ‘శాటన్- 2’ను ఏ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆపలేదు. రష్యా బార్డర్‌లోని ఫిన్లాండ్లో నాటో కూటమి సేనలను అమెరికా మోహరించిన నేపథ్యంలో ‘శాటన్- 2’ను టెస్ట్ చేయాలని రష్యా ఆర్మీకి అధ్యక్షుడు పుతిన్ ఆర్డర్ ఇచ్చారు. ‘శాటన్- 2’ మిస్సైల్స్‌తో మొదటి రెజిమెంట్‌ను డిసెంబరుకల్లా రెడీ చేయాలని ఆయన ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
శాటన్ -2 మిస్సైల్‌ను పుతిన్ 2018లో ఆవిష్కరించారు. 2022 ఏప్రిల్‌లోనూ ఈ క్షిపణిని ఒకసారి టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణి వల్ల ప్రధానంగా నాటో కూటమిలోని దేశాలకు భయం పట్టుకుంది. ఉక్రెయిన్‌కు మద్దతుగా బరిలోకి దిగితే.. ‘శాటన్- 2’ మిస్సైల్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలనే సంకేతాలను ఇచ్చేందుకే పుతిన్ తాజా నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు(Unstoppable Missile) అంటున్నారు.
Related News
150 Killed : మాస్కోలో ఉగ్రదాడి.. 150కి చేరిన మృతులు.. 11 మంది అరెస్ట్
150 Killed : రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ హాలులో నలుగురు ఉగ్రమూకల రక్తక్రీడకు 150 మంది బలయ్యారు.