First Lady : దేశ ప్రథమ మహిళగా అధ్యక్షుడి కుమార్తె.. కీలక నిర్ణయం
First Lady : పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) కో ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేతగా బాధ్యతలు చేపట్టారు.
- By Pasha Published Date - 04:06 PM, Mon - 11 March 24

First Lady : పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) కో ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేతగా బాధ్యతలు చేపట్టారు. 14వ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. సాధారణంగా దేశాధ్యక్షుడి సతీమణికి ప్రథమ మహిళ హోదా లభిస్తుంది. అయితే జర్దారీ భార్య, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆసిఫ్ అలీ జర్దారీ మరో వివాహం చేసుకోలేదు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన టైంలో ప్రథమ మహిళ హోదాను ఖాళీగా ఉంచారు. ఈ క్రమంలోనే దేశ ప్రథమ మహిళగా తన చిన్న కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join
పై వివరాలను బలపరుస్తూ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పెద్ద కుమార్తె భక్తావర్ భుట్టో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ‘‘కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర్నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి అన్ని వేళలా మా పాక్ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచింది’’ అని తన పోస్టులో రాసుకొచ్చారు. 2020లో ఆసిఫా తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి పీపీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జర్దారీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా ఆసిఫా హాజరయ్యారు.
Also Read : Gobi Manchurian : ఆ మంచూరియా, పీచు మిఠాయి సేల్స్‌పై నిషేధం
- అధ్యక్షుడి జీవిత భాగస్వామి చనిపోయిన సందర్భాల్లో. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి కుమార్తెలు, సోదరీమణులు లేదా మేనకోడళ్లకు ప్రథమ మహిళ హోదా ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది.
- అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ తన హయాంలో తన మేనకోడలు ఎమ్లీ డోనెల్సన్‌ను దేశ ప్రథమ మహిళగా ప్రకటించారు.
- అమెరికాలో మరో ఇద్దరు మాజీ అధ్యక్షులు చెస్టర్ ఆర్థర్, గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ తమ సోదరీమణులకు దేశ ప్రథమ మహిళ (First Lady) హోదాను కల్పించారు.