HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Plane Crash In America

Plane Crash in America : అమెరికాలో మరో విమాన ప్రమాదం..

Plane Crash in America : యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1382 విమానం హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురైంది

  • Author : Sudheer Date : 03-02-2025 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Plane Crash In America
Plane Crash In America

అమెరికా(America )లో ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు (Plane Crash) భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌరవిమానం ఒకదానికొకటి ఢీకొని, మంటలు చెలరేగడంతో మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు మూడ్రోజులకే ఫిలడెల్ఫియాలో మరో విమానం షాపింగ్ మాల్ వద్ద కూలిపోయి, ఏడుగురు మరణించగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1382 విమానం హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురైంది. హ్యూస్టన్‌లోని జార్జి బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన ప్రయాణికులు భయంతో పెద్దగా అరిచారు. దీంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై, అత్యవసర తలుపులు తెరిచి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు.

ఈ విమానంలో మొత్తం 104 మంది ప్రయాణికులు ఉండగా, నలుగురు సిబ్బందితో సహా వారందరినీ సురక్షితంగా కిందకు దించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. ప్రయాణికులందరినీ మధ్యాహ్నం 12.30 గంటలకు మరో విమానం ద్వారా న్యూయార్క్ పంపించారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు విమాన ప్రయాణాల గురించి ఆలోచనలో పడుతున్నారు. ముఖ్యంగా, సాంకేతిక సమస్యల నివారణపై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • plane crash

Related News

    Latest News

    • శాంతి చ‌ర్చ‌లు విఫ‌లం.. కార‌ణం నెత‌న్యాహు ఫోన్ కాల్‌?!

    • హిస్టరీ క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ!

    • వాంఖడే స్టేడియంలో చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ!

    • Bio-Gas Project : సిద్దిపేటలో బయో-గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభం

    • అందమైన మహిళ కావాల‌ని అడిగిన ఉగాండా సైన్యాధిపతి!

    Trending News

      • హోర్ముజ్ జలసంధి క్లియరెన్స్‌కు అమెరికా వ్యూహం!

      • KKR అభిమానులకు గుడ్ న్యూస్.. రూ. 18 కోట్లు పెట్టి కొన్న స్టార్ బౌలర్ ఫిట్!

      • 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 78 వేల సబ్సిడీ.. ఏంటి ఈ ప్రభుత్వ పథకం?

      • చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌!

      • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd