Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి
పాకిస్థాన్ ప్రభుత్వం సైన్యం "కౌంటర్ టెర్రరిజం" పేరుతో ఈ ప్రాంతాల్లో కొంతకాలంగా దాడులు చేస్తోంది. కానీ వాస్తవానికి ఉగ్రవాదులను అణచివేయడం కంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించే సాధారణ ప్రజలపైనే ఎక్కువగా ఈ దాడులు
- By Sudheer Published Date - 04:00 PM, Mon - 22 September 25

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (Pakistan Air Force) స్వదేశంలోనే భీకర వైమానిక దాడికి పాల్పడింది. ఖైబర్ పఖుంఖ్వా ప్రావిన్స్‌లోని మాత్రే దార్ గ్రామంపై 8 LS-6 బాంబులను విసిరింది. ఈ దాడిలో 30 మందికిపైగా నిరపరాధ పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గ్రామంలో ఇళ్లు ధ్వంసమై, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికుల ప్రకారం, ఈ దాడి తర్వాత గ్రామం యుద్ధభూమిని తలపిస్తోందని చెబుతున్నారు.
Chiranjeevi : ‘ప్రాణం ఖరీదు’ కు 47 ఏళ్లు
పాకిస్థాన్ ప్రభుత్వం సైన్యం “కౌంటర్ టెర్రరిజం” పేరుతో ఈ ప్రాంతాల్లో కొంతకాలంగా దాడులు చేస్తోంది. కానీ వాస్తవానికి ఉగ్రవాదులను అణచివేయడం కంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించే సాధారణ ప్రజలపైనే ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఖైబర్ పఖుంఖ్వా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని వాడుకలోకి తెచ్చిందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.
మాత్రే దార్ గ్రామంలో జరిగిన ఈ దాడి పాకిస్థాన్‌లో ప్రజా వ్యతిరేక చర్యలకు ఒక నిదర్శనంగా నిలిచింది. నిరపరాధుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఎలాంటి ప్రభుత్వానికైనా తగదని, దీనిని ఖండిస్తూ మానవ హక్కుల రక్షణ కోసం గ్లోబల్ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, దాడుల భయంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది.