Worlds Fastest Climbers : 92 రోజుల్లో 14 శిఖరాలు అధిరోహించారు.. 8,611 మీటర్ల జర్నీ సక్సెస్
Worlds Fastest Climbers : వాళ్లిద్దరూ అసాధ్యులు.. కేవలం 92 రోజులలో 8,611 మీటర్ల ఎత్తులో ఉన్న మొత్తం 14 శిఖరాలను అధిరోహించి అసాధారణ ఫీట్‌ను సాధించారు.
- By Pasha Published Date - 10:17 AM, Fri - 28 July 23

Worlds Fastest Climbers : వాళ్లిద్దరూ అసాధ్యులు..
కేవలం 92 రోజులలో 8,611 మీటర్ల ఎత్తులో ఉన్న మొత్తం 14 శిఖరాలను అధిరోహించి అసాధారణ ఫీట్‌ను సాధించారు.
నార్వే మహిళ క్రిస్టిన్ హరిలా (37), ఆమె నేపాలీ షెర్పా గైడ్ టెంజెన్ (35) ఈ రికార్డును సొంతం చేసుకున్నారు.
Also read : World Hepatitis Day-2023 : “ఒక జీవితం.. ఒకే కాలేయం”.. అవగాహనతో హెపటైటిస్ ను జయిద్దాం!
క్రిస్టిన్ హరిలా, షెర్పా గైడ్ టెంజెన్ ల పర్వతారోహణ మిషన్.. పాకిస్థాన్‌లోని మౌంట్ K2 శిఖరంపైకి చేరడంతో ముగిసింది. పర్వతారోహకులకు లాజిస్టిక్స్‌ను అందించే నేపాలీ ఆర్గనైజింగ్ కంపెనీ సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ (SST) సహకారంతో ఆ ఇద్దరు కలిసి రికార్డ్ బ్రేకింగ్ ఫీట్‌ని సాధించారు. దీంతో ఇంతకుముందు 2019 సంవత్సరంలో 6 నెలల ఒక వారం రోజుల వ్యవధిలో 14 శిఖరాలను అధిరోహించిన నిర్మల్ పుర్జా రికార్డును క్రిస్టిన్ హరిలా జోడీ బద్దలు కొట్టింది. త్వరలోనే వీరిద్దరి పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎంట్రీ కాబోతున్నాయి.
ఏప్రిల్ 26న చైనాలోని టిబెట్ లో మొదలు..
ఈ ఏడాది ఏప్రిల్ 26న చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న శిషాపంగ్మా శిఖరం వైపు నుంచి క్రిస్టిన్ హరిలా, గైడ్ టెంజెన్ జోడీ జర్నీని మొదలుపెట్టింది. ఆ తర్వాత వరుసగా నేపాల్‌లోని ఎవరెస్ట్, కాంచన గంగా, లోట్సే, మకాలు, చో ఓయు, ధౌలగిరి, మనస్లు, అన్నపూర్ణ, నంగా పర్బత్, గషెర్‌బ్రమ్ I, గాషెర్‌బ్రమ్ II, బ్రాడ్ పీక్ శిఖరాలను దాటుకుంటూ అంచులో ఉన్న K2 శిఖరంపైకి చేరుకున్నారు. 92 రోజులలో మొత్తం 14 శిఖరాలను అధిరోహించారు. ఈక్రమంలో అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు గారెట్ మాడిసన్ సహకారం తీసుకున్నారు.
Also read : Star Symbol On Currency Note : స్టార్ సింబల్ ఉన్న నోట్లు నకిలీవి కావు..ఆర్‌బీఐ క్లారిటీ