New Omicron:యూకేలో ఒమైక్రోన్ కొత్త వేరియంట్ దడ.. ఇది ఆందోళనకరమైందేనా?
కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కొత్త కొత్త వేరియంట్ల అవతారంలో వేధిస్తోంది.
- By Hashtag U Published Date - 12:08 PM, Thu - 15 September 22

కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కొత్త కొత్త వేరియంట్ల అవతారంలో వేధిస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దాని పేరు.. “ఒమిక్రాన్ బీఏ.4.6”. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లలో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యూకేలోని మొత్తం కొవిడ్ కేసుల్లో 3.3 శాతం.. అమెరికాలోని కొవిడ్ కేసుల్లో 9 శాతం “ఒమిక్రాన్ బీఏ.4.6” వేరియంట్ వే కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లోనూ ఈ వేరియంట్ ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు అమెరికా సీడీసీ వెల్లడించింది.
UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం..
UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కోవిడ్ వేరియంట్లపై తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ కొత్త వేరియంట్ ఆగస్ట్ 14వ తేదీ నాటికి UKలో 3.3 శాతం నమూనాలను కలిగి ఉండగా.. ఇప్పుడది 9 శాతానికి పెరిగింది. అంటే ఎంత వేగంగా ఈ వేరియంట్ వ్యాపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు.ఇంగ్లాండ్ లో BA.5 కంటే BA.4.6 6.55 వేగంగా వ్యాపించే అవకాశం ఉందని ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి.
ఏమిటీ ” BA.4.6″ ?
BA.4.6 అనేది ఓమిక్రాన్ కు చెందిన BA.4 రూపాంతర సంతతి. BA.4 మొదటి సారిగా జనవరి 2022లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. అప్పటి నుంచి BA.5 వేరియంట్ తో పాటు ప్రపంచమంతటా వ్యాపించింది. BA.4.6 ఎలా ఉద్భవించిందో పూర్తిగా స్పష్టంగా తెలియలేదు, కానీ అది రీకాంబినెంట్ వేరియంట్ కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. SARS-CoV-2 (COVID-19కి కారణమయ్యే (వైరస్) రెండు వేర్వేరు రకాలు ఒకే వ్యక్తికి ఒకే సమయంలో సోకినప్పుడు ఇలా పునఃసంయోగం జరుగుతుంది. BA.4.6 అనేక విధాలుగా BA.4ని పోలి ఉంటుంది. ఇది వైరస్ ఉపరితలంపై ఉన్న ప్రోటీన్ అయిన స్పైక్ ప్రోటీన్ కు మ్యూటేషన్ ను కలిగి ఉంటుంది. ఈ ప్రోటీన్ మనిషి కణాలలోకి ప్రవేశించడానికి సులభతరం చేస్తుంది. పాత వేరియంట్ల తో పోలిస్తే ఓమిక్రాన్ ఇన్ ఫెక్షన్ లు కొంచెం తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి.
BA.4.6 ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది. దీని వల్ల మరణాలు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అయితే
రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడంలో BA.5 కంటే BA.4.6 కొంచెం మెరుగ్గా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
Related News

Crime News: యూకే లో హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్కు చెందిన 65 ఏళ్ల వ్యక్తిని యూకేలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.