Asteroid Alert: ఇవాళ భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్
రెండు క్రికెట్ పిచ్‌ల పొడవు కంటే రెట్టింపు సైజులో ఈ ఆస్టరాయిడ్(Asteroid Alert) ఉంది.
- By Pasha Published Date - 12:23 PM, Sun - 15 September 24

Asteroid Alert: ఆస్టరాయిడ్లను మనం తెలుగులో గ్రహ శకలాలు అని పిలుస్తుంటాం. గ్రహశకలాలు భూమి పుట్టినప్పటి నుంచే ఉన్నాయి. అవి నిత్యం భూమికి దగ్గరగా వచ్చి వెళ్తున్నాయి. అయితే వాటి కదలికలను కేవలం గత కొన్నేళ్లుగానే మనం ట్రాక్ చేయగలుగుతున్నాం. అంతకు ముందు సరైన టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో ఆస్టరాయిడ్ల ట్రాకింగ్ సాధ్యపడేది కాదు. దానివల్ల నాటి తరం ప్రజలు కులాసాగా ఉండేవాళ్లు. ఇప్పుడు నాసా వంటి సంస్థలు అదే పనిగా ఆస్టరాయిడ్ల కదలికలను ట్రాక్ చేస్తూ.. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను ఇస్తూ లేని టెన్షన్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
Also Read :Prashant Kishor : మద్య నిషేధంతో ఏటా రూ.20వేల కోట్ల నష్టం.. గెలవగానే బ్యాన్ ఎత్తేస్తాం : పీకే
నాసా నుంచి వచ్చిన కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. దాదాపు 721 అడుగుల నుంచి 1575 అడుగుల చుట్టుకొలత కలిగిన భారీ గ్రహశకలం (ఆస్టరాయిడ్) ఇవాళ (సెప్టెంబరు 15న) రాత్రికల్లా భూమికి చేరువలోకి వచ్చి వెళ్లనుంది. రెండు క్రికెట్ పిచ్‌ల పొడవు కంటే రెట్టింపు సైజులో ఈ ఆస్టరాయిడ్(Asteroid Alert) ఉంది. గంటకు 25వేల మీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోంది. భూమికి దాదాపు 6.20 లక్షల మైళ్లదూరం దాకా ఈ ఆస్టరాయిడ్ వచ్చి వెళ్లిపోనుంది. దీనికి నాసా శాస్త్రవేత్తలు ‘2024 ఓఎన్’ అని పేరు పెట్టారు.
Also Read :Asaduddin Owaisi : తాజ్‌మహల్ నిర్వహణే చాతకావడం లేదు.. ‘వక్ఫ్’ ఆస్తులూ కావాలా.. ఏఎస్ఐపై అసదుద్దీన్ భగ్గు
ప్రతి 10 సంవత్సరాలకు ఓసారి ఇలాంటి గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్లడం కామనే అని సైంటిస్టులు చెబుతున్నారు. ఉత్తర అర్ధగోళం పరిధిలోని దేశాల నుంచి ఇవాళ టెలిస్కోప్‌లు లేదా బైనాక్యులర్ సాయంతో ఈ గ్రహశకలాన్ని చూడొచ్చు. గ్రహశకలాలు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. చాలా గ్రహశకలాలు వివిధ రకాల రాళ్లతో తయారు చేయబడ్డాయి. నికెల్, ఇనుము వంటి లోహలతో పాటు మట్టి వీటిలో నిండి ఉంటుంది. ఆస్టరాయిడ్స్ భూమిని ఒకవేళ ఢీకొంటే అడ్డుకునే టెక్నాలజీల తయారీపైనా ఇప్పుడు ముమ్మర రీసెర్చ్ జరుగుతోంది.