Space Junk : ‘స్పేస్’ జామ్.. భూకక్ష్యలో భారీగా శాటిలైట్లు, అంతరిక్ష వ్యర్థాలు
ఒక్కో రాకెట్ శకలం(Space Junk) సైజు సగటున ఒక ట్రక్కు అంతటి పరిమాణంలో ఉంటుందట.
- By Pasha Published Date - 04:59 PM, Mon - 2 December 24

Space Junk : అంతరిక్షమే కదా అని దాన్ని శాటిలైట్లతో ప్రపంచ దేశాలు నింపేస్తున్నాయి. కాలం తీరిపోయిన చాలా శాటిలైట్లు అంతరిక్షంలో వేస్టుగా అటూఇటూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో 14వేల ఉపగ్రహాలు తిరుగుతుండగా, వాటిలో 3,500 శాటిలైట్లు ఎందుకు పనికిరాకుండా మారినవే. అంతరిక్షంలోకి శాటిలైట్లను వదిలేందుకు రాకెట్లను వాడుతుంటారు. స్పేస్‌లోకి రాకెట్లు వెళ్లిన తర్వాత.. వాటిలోని కొన్ని శకలాలు అంతరిక్ష వాతావరణంలోకి రిలీజ్ అవుతాయి. అవి కూడా స్పేస్‌లో తలో దిక్కుకు తిరుగుతున్నాయి. ప్రస్తుతం అంతరిక్షంలో దాదాపు 12 కోట్లకుపైగా రాకెట్ శకలాలు ఉన్నట్లు ఒక అంచనా. ఒక్కో రాకెట్ శకలం(Space Junk) సైజు సగటున ఒక ట్రక్కు అంతటి పరిమాణంలో ఉంటుందట. ఈవివరాలను ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ వెల్లడించింది. స్పేస్ జంక్ పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్థకు సహ అధ్యక్షురాలిగా ఆర్తి హోల్లా మైని వ్యవహరిస్తున్నారు.
Also Read :Agniveer Recruitment : డిసెంబరు 8 నుంచి హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పెద్దసంఖ్యలో చేరడం డేంజర్ అని ఆర్తి అంటున్నారు. ఉపగ్రహాలు ఒకదాన్నొకటి ఢీకొనకుండా నిరోధించేందుకు అంతరిక్ష రంగంలో, శాటిలైట్ల ప్రయోగంలో పనిచేసే సంస్థల మధ్య పరస్పర సమన్వయం అవసరమని ఆమె తెలిపారు. సురక్షితమైన భూకక్ష్య కోసం అందరూ ఏకమై ముందుకు సాగాలని ఆర్తి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నేవిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఎదురు కాకూడదు అంటే దిగువ భూకక్ష్యను సురక్షితంగా మార్చే దిశగా ప్రపంచ దేశాలు ఏకమై కసరత్తు చేయాలని ఆమె పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read :CM Cup : డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు ‘సీఎం కప్’ క్రీడోత్సవాలు
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ కంపెనీ ఇప్పటికే వేల ఉపగ్రహాలను ప్రయోగించింది. నవంబర్ 27 నాటికి భూమి ఉపరితలం నుంచి 540-570 కిలోమీటర్ల ఎత్తులో స్టార్‌లింక్‌కు చెందిన 6,764 శాటిలైట్స్ ఉన్నాయి.చైనా కూడా అదే బాటలో పయనిస్తోంది. దీనివల్ల భూమి ప్రాథమిక కక్ష్యలపై ఒత్తిడి పెరుగుతోందని పరిశీలకులు అంటున్నారు.