HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Mom Guinness World Record Feeding Premature Babies

America: అరుదైన గిన్నిస్ రికార్డు సాధించిన మాతృమూర్తి.. 1600 లీటర్ల చనుబాలు దానం?

స్త్రీలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది

  • Author : Anshu Date : 16-07-2023 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
America
America

స్త్రీలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది స్త్రీలకు పిల్లలు కలిగినప్పటికీ పాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో కొంతమంది వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల మందులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక మహిళ తల్లి పాలను దానం చేసి గిన్నిస్ రికార్డును సాధించింది. చనుపాలు దానం చేయడము అంటే ఒకటి రెండు లీటర్లు అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే ఆమె ఏకంగా 1600 చనుపాలను దానం చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్‌ అనే మహిళ ఈ అరుదైన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి.

ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఒక బిడ్డకు ఎలిసబెత్‌ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని అలాగే కొనసాగించారు. ఇలా ఒకరు ఇద్దరు కాదండోయ్ చాలా మంది శిశువులకు పాలను ఇచ‍్చారు. 2015 నుంచి 2018 వరకు దాదాపుగా 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో ఈమె గిన్నీస్ రికార్డ్ సాధించింది. ఈ అరుదైన గిన్నీస్ రికార్డ్ సాధించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపింది. తన లోపంతో ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని వైద్యులు వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • donate milk
  • feeding
  • mom guinness
  • mom guinness record

Related News

Iranian President Masoud Pezeshkian

యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

Masoud Pezeshkian  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way […]

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Gold Deal

    అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

Latest News

  • విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భార‌త్‌!

  • అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

  • భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd