India Warns Canada: కెనడాలో ఖలిస్తాన్ రెఫరెండంపై మోదీ సర్కార్ హెచ్చరిక…నిప్పుతో ఆడుతోంది..!!
కెనడాలో పెరుగుతున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ ఉద్యమం పట్ల భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది.
- By hashtagu Published Date - 04:45 PM, Mon - 10 October 22

కెనడాలో పెరుగుతున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ ఉద్యమం పట్ల భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. నవంబర్ 6న కెనడాలో జరగనున్న ఖలిస్తానీ రెఫరెండంపై కఠినంగా వ్యవహరిస్తూ…ఈ రెఫరెండం భారత సౌర్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు అని మోదీ సర్కార్ పేర్కొంది. సిక్కుతీవ్రవాదని వదిలిపెట్టి నిప్పుతో ఆడుకుంటోందని భారత్ హెచ్చరించింది.
కెనడాలో భారత్ వ్యతిరేక ఖలిస్తానీ ఉద్యమాన్ని ఆపివేయడం లేదు. అంతకుముందు ఖలిస్తానీ తీవ్రవాదులు బ్రాంప్టన్ లోని స్వామినారాయణ ఆలయంలో దాడులు చేశారు. ఈ ఘటనపై కెనడా పోలీసులు ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో నంవబర్ 6న ఖలిస్తానీ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి భారత ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది. ఈ రెఫరెండం భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని భారత్ పేర్కొంది. భారత్ సిక్కు సమాజంపై ఉనికిలో లేని దురాగతాల పేరుతో అమెరికా, లండన్, జర్మనీ నుంచి డబ్బును దోచుకునేందుకు ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఫండమెంటలిస్టులు ఉపయోగిస్తున్నారంటూ మండిపడింది.
ఈ ప్రజాభిప్రాయ సేకరణను నిలివేయాలంటూ జస్టిస్ ట్రూడో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి కెనడా రాజధాని ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం కూడా వచ్చేవారం కెనడా గ్లోబల్ అఫైర్స్ లో ఈ అంశాన్ని లేవనెత్తుతుంది. సిక్కు తీవ్రవాది జెఎస్ పన్నూ నిర్వహిస్తున్న ఎస్ ఎఫ్ జే ( సిక్కు ఫర్ జస్టిస్ ) అంశాన్ని కూడా భారత్ లేవనెత్తింది. ప్రవాస భారతీయులను విభజించేందుకు ఈ రెఫరెండం ఉపయోగిస్తున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 16న కెనడ ప్రభుత్వం భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవిస్తుందని…ప్రజాభిప్రాయ సేకరణను అనమతించమని పేర్కొంది. అయినప్పటికీ సెప్టెంబర్ 18న అంటారియోలోని బ్రాంప్టన్ లో ఖిలిస్తానీ వ్యతిరేఖ ఉద్యమం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై ట్రూడో ప్రభుత్వం తమ దేశంలోని ఏ వ్యక్తికైనా చట్ట పరిధిలో ఉంటూ శాంతియుతంగా తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని స్పష్టం చేసింది.