‘Mass Shooting’ In Bangkok : బాంకాక్‌లో తుపాకీ కాల్పుల కలకలం..6 మృతి
'Mass Shooting' In Bangkok : మార్కెట్ లోకి చొరబడిన దుండగుడు...ఐదుగురిపై కాల్పులు జరిపి.. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు
- By Sudheer Published Date - 01:33 PM, Mon - 28 July 25

థాయ్‌లాండ్ రాజధాని బాంకాక్(Bangkok )లో తుపాకీ మోత (Mass Shooting) హడలెత్తింది. ఓ మార్కెట్‌లో ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడి ఆరుగుర్ని హతమార్చాడు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకోగా, మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడని పోలీసుల అధికారి చరిన్ గోపట్టా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ లోకి చొరబడిన దుండగుడు…ఐదుగురిపై కాల్పులు జరిపి.. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..మూడు గేట్ల ద్వారా నీటి విడుదల
ఈ ఘటన బాంకాక్‌లోని ‘ఒర్ టో కో’ అనే మార్కెట్‌లో జరిగింది. ఈ మార్కెట్ వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాదేశిక భోజన పదార్థాలను అమ్మే ప్రఖ్యాత కేంద్రంగా ఉంది. అక్కడ పనిచేస్తున్న నలుగురు భద్రతా సిబ్బందిని గన్‌మ్యాన్ టార్గెట్‌గా చేసుకుని కాల్చి చంపాడు. వీరితో పాటు ఓ మహిళ కూడా ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్టు ఎరావాన్ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ పేర్కొంది.
ఈ ఘటనతో బాంకాక్ నగరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కాల్పుల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనాస్థలాన్ని మూసివేసి విచారణ చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శవాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. దుండగుడి ఈ చర్యకు కారణమైన వాస్తవాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.