China :టెలికాం బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం…దట్టంగా ఎగిసిపడతున్న మంటలు..!!
డ్రాగన్ కంట్రీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఛాంగ్సూనగరంలో ఉన్న ఓ భారీ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
- By hashtagu Published Date - 11:32 PM, Fri - 16 September 22

డ్రాగన్ కంట్రీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఛాంగ్సూనగరంలో ఉన్న ఓ భారీ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న ఫ్లోర్లన్నీ మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ పోస్టు చేశారు స్థానికులు. అయితే ఈ ప్రమాదంలోఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియలేదు. టెలికాం బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తోంది. హువాన్ ప్రావిన్సు రాజధాని ఛాంగ్సూ ఈ నగరంలో సుమారు పది మిలియన్ల జనాభా ఉంటుంది.
This afternoon, the building of China Telecom building in Changsha长沙caught fire, no casualties reported yet, stay safe everyone! 🙏 pic.twitter.com/QNnezk2Mxk
— China in Pictures (@tongbingxue) September 16, 2022