సీరియల్ కిల్లర్ తో లవ్.. 64 ఏళ్ల వ్యక్తితో 21 ఏళ్ల అమ్మాయి ప్రేమ?
భారతీయ సంతతకి చెందినటువంటి మూలాలున్న ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి రిలీజ్ కానున్నారు.
- By Anshu Published Date - 10:09 PM, Thu - 22 December 22

భారతీయ సంతతకి చెందినటువంటి మూలాలున్న ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి రిలీజ్ కానున్నారు. 2003 నుంచి ఆయన నేపాల్ లోని ఖాట్మండు జైల్లో ఉండగా ఎట్టకేలకు ఆయన్ని విడుదల చేస్తున్నారు. ఈయన శిక్ష కాలం కంటే ఎక్కువ రోజులు జైలు జీవితాన్ని గడిపినట్లు ఆరోపించడంతో కోర్టు ఈయన ప్రవర్తన బావుందని విడుదల చేస్తోంది.
వృద్ధాప్యం కారణాల వల్ల కూడా శోభరాజ్ ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా శోభరాజ్ ను ఆయన దేశానికి పంపించాలని ఆదేశాలను ఇవ్వడంతో ఆయన రిలీజ్ కానున్నారు. గత కొన్ని రోజులకు ముందు శిక్షాకాలం కంటే ఎక్కువ కాలం తాను జైల్లో గడిపానని శోభరాజ్ నేపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.
నేపాల్ లో సీనియర్ సిటిజెన్లకు ఇచ్చిన సడలింపు ప్రకారం తాను పూర్తి కాలం శిక్షను అనుభవించానని తన పిటిషన్ లో శోభరాజ్ తెలిపాడు. 75 శాతం శిక్ష అనుభవించి, సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు నేపాల్ లో చట్టపరమైన నిబంధన ఉండటంతో ఆయనను విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా శోభరాజ్ పై అప్పట్లో సినిమాకు వచ్చింది.
శోభరాజ్ తండ్రి ఇండియన్ కాగా తల్లి వియత్నాం జాతీయురాలు కావడం విశేషం. శోభరాజ్ 20కి పైగా హత్యలు చేసి జైలుకెళ్లాడు. ఈయనను 21 ఏళ్ల మహిళ ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. శోభరాజ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ‘మే ఔర్ ఛార్లెస్’ పేరుతో 2015లో సినిమా వచ్చింది. నిఖితా బిష్వాస్ అనే మహిళ జైలులో ఖైదీలకు ట్రాన్స్ లేటర్ గా వెళ్లింది. ఆ సమయంలో శోభరాజ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆయన్ని ప్రేమించి 2008లో పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే 2003లో శోభరాజ్ ను అధికారులు అరెస్ట్ చేయడం గమనార్హం.