Los Angeles: లాస్ ఏంజిల్స్‌లో నిప్పులు చిమ్ముతున్న వలస నిరసనలు
Los Angeles: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
- By Kavya Krishna Published Date - 11:51 AM, Tue - 10 June 25

Los Angeles: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వలస వ్యతిరేక విధానాలపై నిరసనగా, లాస్ ఏంజిల్స్ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు.
తాజాగా జరిగిన నిరసనలో, భద్రతా బలగాలు వాటిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లతో ప్రతిఘటించారు. ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ సమీపంలో మోహరించిన పోలీసులు, ప్రజలను చెదరగొట్టేందుకు ఫ్లాష్ బ్యాంగ్స్ వాడారు.
స్థితిగతులను అదుపులోకి తెచ్చేందుకు నేషనల్ గార్డ్స్‌ను మోహరించాల్సి వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 700 మంది మెరైన్‌లు లాస్ ఏంజిల్స్‌లో మోహరించారు. “గతంలో ఈ చర్యలు తీసుకోకపోయుంటే లాస్ ఏంజిల్స్ పూర్తిగా బూడిదయ్యేదని” ట్రంప్ తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే, నగర మేయర్ తాను చేసిన ప్రయత్నాలను గుర్తించి కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయంలో, ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.
ప్రస్తుతం నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. పోలీసుల లౌడ్ స్పీకర్ ద్వారా పదేపదే ప్రకటనలు చేస్తూ ప్రాంతాలను ఖాళీ చేయమంటున్నా, నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో మళ్లీ బలవంతంగా వారిని చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వలస విధానాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, భద్రతా బలగాల ధాటికి తలవంచని నిరసనలు ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లినట్టు స్పష్టమవుతోంది.
Murder: వీడిన బెంగళూరులో వివాహిత హత్య మిస్టరీ..