UK : యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా..ఆ కారణంతోనే..!!
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కేవలం 45రోజులు మాత్రమే పదవీకాలంలో ఉన్నారు.
- By hashtagu Published Date - 06:47 PM, Thu - 20 October 22

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కేవలం 45రోజులు మాత్రమే పదవీకాలంలో ఉన్నారు. ఇంతలోనే రాజీనామా చేయడం కలకలం రేపింది. అయితే చాలా రోజులనుంచి ఆమె రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఉన్నారు. ఇప్పుడా ఆ నిర్ణయం తీసుకన్నారు. తన రాజీనామాపై లిజ్ ట్రస్ స్పందించారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను. అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో ఆర్థిక స్థిరత్వం లేదన్నారు. బిల్లులు ఎలా వసూలు చేస్తారోనని ఎంతో మంది ఆందోళనకు దిగారు. పన్నులు తగ్గించాలనుకున్నాం. బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాది వేయడానికి ప్రయత్నించాము. కానీ అవన్నీ నేను నెరవేర్చలేకపోతున్నాను అంటూ చెప్పుంది. అందుకే రాజీనామా చేస్తున్నానంటూ ఆమె స్పష్టం చేశారు.
Liz Truss resigns as UK Prime Minister
Read @ANI Story | https://t.co/jPhkhb7IgM#UKPM #LizTrussPM #Trussresigns pic.twitter.com/P3uhBU3Ofp
— ANI Digital (@ani_digital) October 20, 2022
లిజ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ మధ్యే పార్లమెంట్ లో మినీ బడ్జెట్ సమర్పించారు. ఈ బడ్జెట్ లో పన్నుల పెంపు, ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎన్నికల్లో పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ నిర్ణయాన్ని ఉసంహరించుకోవడంతో..పార్టీలోచాలామంది వ్యతిరేకించారు. ట్రస్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. అనుకున్నట్లు ట్రస్ రాజీనామా చేయడంతో ఇప్పుడు యూకేలో తర్వాత ఏంటీ అనే సందేహం మొదలైంది.