Mr Smile : ‘మిస్టర్ స్మైల్’.. ఉద్యోగుల నవ్వును స్కాన్ చేస్తాడు
‘మిస్టర్ స్మైల్’ ఏఐ టెక్నాలజీ సందడి చేస్తోంది. ఈ ఏఐ టెక్నాలజీ మనుషుల నవ్వులను కొలుస్తుంది.
- By Pasha Published Date - 01:54 PM, Wed - 24 July 24

Mr Smile : ‘మిస్టర్ స్మైల్’ ఏఐ టెక్నాలజీ సందడి చేస్తోంది. ఈ ఏఐ టెక్నాలజీ మనుషుల నవ్వులను కొలుస్తుంది. వాటికి గ్రేడింగ్ ఇస్తుంది. మనుషుల ముఖ కవళికలు, శబ్దం, మాట్లాడే పద్ధతి వంటి 450 అంశాలను కొలిచే సామర్థ్యం ‘మిస్టర్ స్మైల్’కు ఉంది. ఈ అద్భుతమైన ఏఐ టెక్నాలజీని ఇప్పుడొక కంపెనీ వాడేస్తోంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
- జపాన్ దేశంలోని సూపర్ మార్కెట్ చైన్ ‘అయాన్’ (AEON) ‘మిస్టర్ స్మైల్’ పేరుతో ఏఐ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది.
- తమ సూపర్ మార్కెట్లకు(Japan Supermarket Chain) వచ్చే కస్టమర్లతో మాట్లాడే క్రమంలో ఉద్యోగులు ఎంతమేరకు నవ్వుతున్నారు ? ఎలా ప్రవర్తిస్తున్నారు ? కస్టమర్లతో మాట్లాడేటప్పుడు హావభావాలు ఎలా ఉన్నాయి ? ఎంత సౌండ్‌తో మాట్లాడుతున్నారు ? అనే అంశాలను ‘మిస్టర్ స్మైల్’ ఏఐ సాఫ్ట్‌వేర్ కొలుస్తుంది.
- కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేలా ఉద్యోగుల కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచేందుకే మిస్టర్ స్మైల్(Mr Smile) సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించారు.
- ఉద్యోగుల ప్రవర్తనా శైలి, ఆహార్యంతో ముడిపడిన దాదాపు 450 అంశాలను కొలిచే సామర్థ్యం ‘మిస్టర్ స్మైల్’కు ఉంది.
- ఈ సాఫ్ట్‌వేర్‌ను తొలుత 8 స్టోర్లలో సీసీ కెమెరాల ద్వారా ప్రవేశపెట్టారు. తద్వారా 3,400 మంది సిబ్బంది కదలికలను, ప్రవర్తనా శైలిన పర్యవేక్షించారు.
- ఈ టెక్నాలజీని కొందరు విమర్శిస్తున్నారు. ఉద్యోగులు నవ్వుతూనే ఉండాలనే నిబంధన సరికాదని.. పరోక్షంగా ఇది ఒక రకమైన వేధింపు అని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.
Also Read :YSRCP : ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కడా..?
- మనిషి మనసారా నవ్వాలే కానీ.. ఆర్టిఫీషియల్‌గా నవ్వితే ఆశించిన ప్రయోజనం లభించదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
- ఈ తరహా పర్యవేక్షణ టెక్నాలజీ వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి మరింత పెరుగుతుందని పలువురు అంటున్నారు.
- ఇటీవల జపాన్ ప్రభుత్వం ప్రతిరోజూ అందరూ నవ్వాలంటూ ఒక విచిత్రమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దేశప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
- నవ్వుతో కూడుకున్న పని వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. నవ్వుతో ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుందని చాటిచెప్పేలా ప్రతినెలా ఎనిమిదో తేదీన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించింది.