Iran Strike : యుద్ధరంగంలోకి ఇరాన్.. ఇరాక్‌లోని ఇజ్రాయెలీ స్పై కేంద్రాలపై ఎటాక్
Iran Strike : ఇటీవల తమ దేశంలో జరిగిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది.
- By Pasha Published Date - 07:56 AM, Tue - 16 January 24
Iran Strike : ఇటీవల తమ దేశంలో జరిగిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ ఉత్తరప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మోసాద్‌కు చెందిన ప్రధాన భవనంపై మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బాలిస్టిక్ మిస్సైళ్లతో ఎటాక్ చేసింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మోసాద్‌కు చెందిన భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో నలుగురు మరణించారని కుర్దిస్తాన్ రీజినల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది. గాయపడ్డ ఆరుగురికి అత్యవసర వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. మృతుల్లో అమెరికా అధికారులు గానీ, ఆ దేశ పౌరులు గానీ ఎవరూ లేరని వివరించింది. ఈ దాడిని అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ దాడి తీవ్రతను అంచనా వేస్తున్నామని, దీన్ని తిప్పి కొట్టక తప్పదని హెచ్చరించింది. ఈ దాడులకు తామే కారణమని ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దాడి చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఎర్బిల్లోని మోసాద్ కేంద్రం.. తమ దేశానికి వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారిందని ఇరాన్ ఆర్మీ ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది. మోసాద్ కేంద్రంపై దాడి అనంతరం ఇరాక్ ఇవాళ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇరాక్ భూభాగంపై దాడికి పాల్పడకూడదనే సెక్యూరిటీ అగ్రిమెంట్‌ను ఇరాన్ అధిగమించినట్టయిందని పేర్కొంది. దీని తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ(Iran Strike) హెచ్చరించింది.
This is the world when the Deep State is in charge. Stolen elections have dire consequences and it gets a lot of people killed.
📢BREAKING: Footage of loud explosions in Erbil, Iraq targeting US consulate and airport.https://t.co/IfNDLCrlFB
— Bob 🇺🇸❤️🙏#45 (@BobFighter_45) January 15, 2024
We’re now on WhatsApp. Click to Join.
ఇజ్రాయెలీ గూఢచర్య కార్యకలాపాలే ఇరాన్ టార్గెట్
ఇరాక్‌లోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెలీ గూఢచర్య సంస్థ మోసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దాడులు చేశామని ఇరాన్ ఆర్మీ అంటోంది. ఆ కార్యాలయం కేంద్రంగా ఇరాన్‌కు వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి, తీవ్రవాద చర్యలను ప్లాన్ చేయడానికి మోసాద్ కసరత్తు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్లో ఇటీవల జరిగిన బాంబు దాడులకు ప్రతిస్పందనగా.. గాజాలో ఇజ్రాయెల్ హింసాకాండకు వ్యతిరేకంగా ఈ దాడి చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇక ఇరాన్ దాడితో.. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత విస్తరించినట్లయింది. రానున్న రోజుల్లో లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్‌లలోని ఇరాన్ మద్దతుగల సాయుధ సమూహాలు మరింత యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన పశ్చిమాసియా మరోసారి యుద్ధం దిశగా వెళ్తోందని స్పష్టమవుతోంది.
Also Read: ED – Kavitha : అప్పటిదాకా విచారణకు రాను.. ఈడీకి స్పష్టం చేసిన కవిత
Related News
Iran Vs Israel : ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకొని తీరుతాం.. ఇజ్రాయెల్ ప్రకటన
Iran Vs Israel : ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి కీలక ప్రకటన చేశారు.