Mexico Explosion: మెక్సికో సూపర్ మార్కెట్లో భారీ పేలుడు
Mexico Explosion: మెక్సికోలోని హెర్మోసిల్లో నగరం (Hermosillo City, Sonora State) ఘోర విషాదంతో మునిగిపోయింది. స్థానిక సూపర్ మార్కెట్లో శనివారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడు దుర్ఘటన
- By Sudheer Published Date - 01:36 PM, Sun - 2 November 25
మెక్సికోలోని హెర్మోసిల్లో నగరం (Hermosillo City, Sonora State) ఘోర విషాదంతో మునిగిపోయింది. స్థానిక సూపర్ మార్కెట్లో శనివారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడు దుర్ఘటనలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నపిల్లలు, ఇద్దరు గర్భిణీలు, అలాగే పలువురు వృద్ధులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మరో 12 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయని, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పేలుడు తర్వాత సూపర్ మార్కెట్ భవనంలో మంటలు వేగంగా వ్యాపించి, లోపల ఉన్న వినియోగదారులు బయటపడే అవకాశం లేకపోవడంతో మృతి సంఖ్య పెరిగిందని స్థానిక మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
BRS Office: బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
సాక్షుల ప్రకారం, పేలుడు శబ్దం అర కిలోమీటరు దూరం వరకు వినిపించిందని, కొద్ది సెకన్లలోనే భవనం అంతా మంటలతో కమ్ముకుపోయిందని తెలిపారు. మంటల తీవ్రత కారణంగా సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీములు సంఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అధికారులు సీసీటీవీ ఫుటేజ్, పేలుడు అవశేషాలను పరిశీలిస్తూ, ఇది ఉద్దేశపూర్వక దాడా లేదా ప్రమాదవశాత్తూ జరిగినదా అన్న కోణంలో విచారణ చేపట్టారు.
Fenugreek Water: ప్రతీ రోజు మెంతుల నీరు తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఈ ఘటనపై సోనోరా రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డురాజో తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇది మాకు చాలా బాధాకరమైన రోజు. నిరపరాధ పౌరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం” అని పేర్కొన్నారు. అలాగే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ ట్వీట్ చేస్తూ, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆమె ప్రభుత్వం తక్షణ సాయ చర్యలు చేపట్టిందని, గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనతో మెక్సికో ప్రజల్లో ఆందోళన వ్యాపించగా, దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు మరింత కఠినతరం చేసినట్లు సమాచారం.