ఇండిగో విమానంలో గొడవ.. నెట్టింట వీడియో వైరల్?
ఇస్లాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ ఎయిర్ హోస్టెస్ తో వాగ్వాదానికి దిగాడు.
- By Nakshatra Published Date - 09:29 PM, Wed - 21 December 22
ఇస్లాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ ఎయిర్ హోస్టెస్ తో వాగ్వాదానికి దిగాడు. ఫ్లైట్ లో సర్వ్ చేస్తున్నటువంటి ఫుడ్ కు సంబంధించి ఈ వివాదం మొదలైంది. తాను కోరిన శాండ్ విచ్ ను సర్వ్ చేయకపోవడంతో ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానికి అంతే తీవ్రతతో ఆ ఎయిర్ హోస్టెస్ కూడా బదులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండిగో ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్, ప్రయాణికుడికి మధ్య జరిగిన ఈ వివాదాన్ని గుర్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు. డిసెంబర్ 19న ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో ఫ్లైట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ హోస్టెస్ ను సర్వెంట్ అని అనడంతో ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యింది.
తాను సర్వెంట్ ను కాదని, ఉద్యోగిని అని ఆ ఎయిర్ హోస్టెస్ స్పష్టం చేసింది. మరోవైపు తన వైపు వేలు చూపిస్తూ, బెదిరిస్తున్నట్లుగా మాట్లాడవద్దని ఆ వ్యక్తిని కట్టడి చేసింది. దీంతో ఆ ప్యాసెంజర్ షటప్ అని గట్టిగా అరిచాడు. అప్పుడు కూడా ఆ ఎయిర్ హోస్టెస్ అంతే గట్టిగా షటప్ అని అరిచింది.
ఫుడ్ సర్వింగ్ లో ఒక పద్దతి ప్రకారంగా ముందు చెప్పిన వివరాల ప్రకారమే ఫుడ్ ఐటమ్స్ ను అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపింది. చివరకు ఆమెను మరో ఉద్యోగి పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. ఈ గొడవ వల్ల సంబంధిత ఉద్యోగిని నుంచి వివరణ తీసుకున్నామని, విమానంలో సప్లై చేసే ఆహారానికి సంబంధించి ప్యాసెంజర్ తో గొడవ జరిగినట్లు వెల్లడించింది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయం కల్పించడమే తమ ధ్యేయమని తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Related News
Kolkata Airport : కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఒకేసారి రన్‌వేపైకి రెండు విమానాలు
ఒకేసారి రెండు విమానాలు ఒకే రన్ వేపైకి రావడంతో ఒకదానికొకటి ఢీకొీన్నాయి