Nikki Haley – Kamala Harris : నేను లేదా కమల.. అమెరికా అధ్యక్ష పీఠంపై మహిళ : నిక్కీ
Nikki Haley - Kamala Harris : అమెరికా అంటే అగ్రరాజ్యం. యావత్ ప్రపంచానికి రారాజుగా అమెరికా వెలుగొందుతోంది.
- Author : Pasha
Date : 20-02-2024 - 12:02 IST
Published By : Hashtagu Telugu Desk
Nikki Haley – Kamala Harris : అమెరికా అంటే అగ్రరాజ్యం. యావత్ ప్రపంచానికి రారాజుగా అమెరికా వెలుగొందుతోంది. అలాంటి పవర్ ఫుల్ దేశం అమెరికాలో ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ వనితే అధ్యక్షురాలిగా అవుతారని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అన్నారు. ప్రస్తుతం నిక్కీ కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వానికి పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష రేసులో ప్రస్తుతం నిక్కీ హేలీ, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే మిగిలారు. ప్రస్తుతానికి 77 ఏళ్ల ట్రంప్‌దే పైచేయిగా ఉన్నప్పటికీ.. చివరి క్షణం వరకు పోరాడుతానని 52 ఏళ్ల నిక్కీ హేలీ స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ట్రంప్‌కు 77 ఏళ్లు.. బైడెన్‌కు 80 ఏళ్లు.. సగం కంటే ఎక్కువ మంది అమెరికన్లు వయసు రీత్యా వాళ్లిద్దరికి మద్దతు తెలపడం లేదు. వాళ్లనే మళ్లీ అధ్యక్షులను చేయాలని అమెరికన్లు భావించడం లేదు. అదే నాకు కలిసి రానుంది. అధికార డెమొక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ పోటీ చేయనున్నారు. అయితే ఆయన కంటే ఆ పార్టీ నాయకురాలు కమలా హ్యారిస్‌కు అవకాశం ఇవ్వడానికి అమెరికన్లు మొగ్గుచూపే అవకాశం ఉంది’’ అని నిక్కీ హేలీ కామెంట్ చేశారు. ‘‘70 శాతం మంది అమెరికన్లు ట్రంప్‌ను కానీ.. బైడెన్‌ను కానీ అధ్యక్ష స్థానానికి కోరుకోవడం లేదు. 59 శాతం మంది అమెరికన్లు బైడెన్, ట్రంప్‌లకు వయసైపోయిందని భావిస్తున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముసలి అభ్యర్ధిని తొలగించే పార్టీయే గెలుస్తుందని నిక్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. నిక్కీ హేలీ (Nikki Haley – Kamala Harris) స్వస్థలం సౌత్ కరోలినా రాష్ట్రం. ఈనెల 24న సౌత్ కరోలినా రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ కలకలం క్రియేట్ చేశాయి.
Also Read :Jayalalitha Jewellery : 6 పెట్టెల్లో జయలలిత ఆభరణాలు.. అవన్నీ ఎవరికో తెలుసా ?
చైనా టిక్‌టాక్‌పై నిక్కీ కామెంట్స్
చైనా యాజమాన్యంలోని యాప్ టిక్‌టాక్ ప్రమాదకరమైనదని ఇటీవల నిక్కీ హేలీ అభివర్ణించారు. భారతదేశం, నేపాల్ వంటి దేశాలు టిక్‌టాక్‌ను ఇప్పటికే నిషేధించాయని గుర్తు చేశారు. అలాంటి ప్రమాదకర యాప్‌లను చైనా నియంత్రిస్తోందని ఆరోపించారు. “చైనా ఇప్పుడు మీ ఆర్థిక వ్యవహారాలను చూడగలదు. వారు ఇప్పుడు మీ కాంటాక్ట్స్ ను చూడగలరు. మీరు దేనిపై క్లిక్ చేస్తారో, దానిపై ఎందుకు క్లిక్ చేస్తారో, అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో వారు చూడగలరు. మీరు చూసేదాన్ని ప్రభావితం చేయగలరు. అవి మీరు విన్నదానిపై ప్రభావం చూపుతాయి. ఇది టిక్‌టాక్‌లోని ప్రమాదకరమైన భాగం” అని హేలీ అన్నారు.