Earthquake in Russia: రష్యాలో భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు..!!
- Author : hashtagu
Date : 27-11-2022 - 6:36 IST
Published By : Hashtagu Telugu Desk
రష్యాలోని సెవెరో కురిల్స్క్ పట్టణంలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు అయ్యింది. usgs ప్రకారం భూకంపం లోతు సుమారు 67.8కిలోమీటర్లు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూమికంపించడంతో ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సెవెరో కురిల్క్స్ అనేది రష్యాలోని సఖాలిన్ ఒబ్లాస్ట్ లోని ఉత్తర కురిల్ దీవులలో ఉండే నగరం.
A 5.0 magnitude earthquake occurred 58.41mi S of Ust’-Kamchatsk Staryy, Russia. Details: https://t.co/p9pMMHGqnh Map: https://t.co/nsGOOfWSCJ
— Earthquake Robot (@earthquakeBot) November 26, 2022