Dubai Car Number Plate: వామ్మో.. కారు నెంబర్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు.. గిన్నీస్ రికార్డు?
సాధారణంగా పెద్దపెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిజినెస్ మాన్ లు, బడా వ్యక్తులు నచ్చిన వస్తువులను
- By Anshu Published Date - 06:30 PM, Mon - 10 April 23

సాధారణంగా పెద్దపెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిజినెస్ మాన్ లు, బడా వ్యక్తులు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడం కోసం కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా కార్ల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టగా ఆ గార్లకు ఇష్టమైన నెంబర్ కోసం మరిన్ని కోట్లు పెడుతూ ఉంటారు. ఎక్కువగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు బడా వ్యక్తులు ఈ విధంగా కోట్లు ఖర్చుపెట్టి మరి ఇష్టమైన నెంబర్ ను సొంతం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా ఫ్యాన్సీ నెంబర్స్ సొంతం చేసుకోవాలనుకుంటే కోట్లల్లో వేలం పాట పాడి చేజిక్కిచ్చుకుంటూ ఉంటారు.
తాజాగా కూడా ఒక వ్యక్తి అలాంటి పనే చేశాడు. వీఐపీ నెంబర్ ప్లేట్ P 7 ను సొంతం చేసుకోవడం కోసం ఏకంగా రూ. 122.6 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఏంటి ఒక నెంబర్ ప్లేట్ కోసం అన్ని కోట్ల అని ఆశ్చర్యపోతున్నారా. మీరు విన్నది నిజమే. ఒక వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ప్లేటును విక్రయించిన వాడిగా గిన్నిస్ రికార్డును కూడా సృష్టించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 8వ తేదీన దుబాయిలో ఎమిరేట్స్ సంస్థ మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటి వేళాన్ని నిర్వహించింది. వన్ బిలియన్ మీల్స్ కూడా ఈ క్యాంప్ ఎందుకు మద్దతుగా నిలిచింది. ఈవెంట్ లో భాగంగా విఐపి నెంబర్ ప్లేట్ p7 కారు నెంబర్ ప్లేట్ కోసం 15 మిలియన్ AED వద్ద వేలంపాట మొదలైంది.
పెండ్ల వ్యవధిలోనే ఈ బిడ్డింగ్ 30 మిలియన్ AED ని దాటేసింది. టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు యజమా పావెల్ వాలెరివిచ్ డ్యూరోవ్ 35 మిలియన్ AED తో వేలం వేశారు. ఇక అక్కడి నుంచి ఒక దశలో ఈ బిడ్డింగ్ కాసేపు ఆగిపోయింది. ఆ తర్వాత చివరికి ఈ బిడ్డింగ్ 55 మిలియన్ దిర్హామ్ అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ. 1222.6 కోట్ల వద్ద ముగిసింది. కానీ ఆ నెంబర్ లేట్ ని ఎవరు సొంతం చేసుకున్నారు అన్న వివరాలు మాత్రం తెలియడం లేదు. ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో ఒక నెంబర్ కోసం ఏకంగా అన్ని కోట్ల అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.