Doctor: 60వ బిడ్డకు తండ్రైన డాక్టర్.. నాలుగో భార్య కోసం ఎదురుచూపు!
చాలా మంది భర్తలు తమ భార్యలతో వేగలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి తనకు ముగ్గురు భార్యలున్నా నాలుగో భార్య కోసం చూస్తున్నాడు.
- By Nakshatra Published Date - 09:41 PM, Wed - 4 January 23
Doctor: చాలా మంది భర్తలు తమ భార్యలతో వేగలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి తనకు ముగ్గురు భార్యలున్నా నాలుగో భార్య కోసం చూస్తున్నాడు. ఈ రోజుల్లో ఒకరిద్దరు పిల్లల్ని కనడమే చాలా కష్టం అలాంటిది ఈ వ్యక్తి తన 60వ సంతానానికి వెల్ కమ్ చెప్పాడు. తాను 100 మందిని కనడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. అతని పేరే సర్దార్ జాన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ కాగా ఇప్పుడు అతని పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది.
సర్దార్ జాన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ 2023వ సంవత్సరంలో తన 60వ బిడ్డకు స్వాగతం పలకడం విశేషం. అంతేకాదు ఈ వ్యక్తి తనకు ఎక్కువ మంది పిల్లలు కావాలని, నాలుగో సారి పెళ్లి చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాడు. క్వెట్టా నగరంలోని తూర్పు బైపాస్ సమీపంలో నివసించే 50 ఏళ్ల పాకిస్తానీ వ్యక్తి అయిన ఇతను వృత్తిరీత్యా వైద్యుడు కావడం విశేషం.
జాన్ ముహమ్మద్కు ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరికి 60 మంది పిల్లలు పుట్టారు. అయితే అందులో ఐదుగురు పిల్లలు చనిపోయారు. 55 మంది పిల్లలు ప్రస్తుతం ఉన్నారు. పిల్లల్లో కొడుకుల కంటే కూతుర్లే అధికంగా ఉన్నారు. తాను తన 60వ బిడ్డ రాకతో సంతోషంగా ఉన్నానని, ఆ బిడ్డకు హాజీ ఖుష్ ఖల్ ఖాన్ అని పేరు పెట్టినట్లు జాన్ ముహమ్మద్ వెల్లడించాడు.
తన ముగ్గురు భార్యలు, పిల్లలు అంతా కలిసి ఒకే ఇంట్లో నివశిస్తున్నట్లు తెలిపాడు. జాన్ ముహమ్మద్ తన గ్రామంలోనే ఒక క్లీనిక్ ను కూడా నడుపుతున్నాడు. ప్రస్తుతం అతను నాలుగో భార్య కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. 100 మంది పిల్లలను కనడమే తన లక్ష్యమని, అది త్వరలోనే నెరవేరుతుందని జాన్ ముహమ్మద్ తెలిపారు.
Related News
Modi Vs Rahul : ‘యువరాజు’ను భారత ప్రధాని చేయాలని పాక్ తహతహ : ప్రధాని మోడీ
Modi Vs Rahul : కాంగ్రెస్ యువరాజును(రాహుల్ గాంధీ) భారత తదుపరిగా ప్రధానమంత్రిగా చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.