HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄World News
  • ⁄Corona Virus In China Situation Getting Worse Viral Video

China Corona: ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. శ్మశానాల్లో శవాలు మోసేవాళ్ళ రిక్రూట్మెంట్.. దడ పుట్టించేలా

కరోనా కారణంగా చైనాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని దాచడానికి చైనా కొత్త కొత్త విన్యాసాలు నడుపుతోంది. 

  • By Hashtag U Published Date - 10:25 AM, Wed - 28 December 22
China Corona: ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. శ్మశానాల్లో శవాలు మోసేవాళ్ళ రిక్రూట్మెంట్.. దడ పుట్టించేలా

కరోనా కారణంగా చైనాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని దాచడానికి చైనా కొత్త కొత్త విన్యాసాలు నడుపుతోంది. గత 6 రోజులుగా అక్కడ కరోనా వల్ల ఎవరూ చనిపోలేదని చైనా పేర్కొంది. అయితే చైనా నుంచి వస్తున్న వీడియోలు మాత్రం అందుకు భిన్నమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి.

షాంఘై నగరానికి చెందిన ఒక వీడియో..

మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్ చైనాలోని షాంఘై నగరానికి చెందిన ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో షాంఘైలోని ఓ ఆస్పత్రిలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి.  అతడి ప్రకారం.. ఈ వీడియో డిసెంబర్ 24 నాటిది. ఇది మాత్రమే కాదు.. జెంగ్ అన్సాన్ నగరం యొక్క వీడియోను కూడా పంచుకున్నారు. చైనాలోని శ్మశాన వాటికలు ఎలా నిండిపోయాయో ఈ వీడియోలో చూడొచ్చు.  కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం గంటల కొద్దీ క్యూ కడుతున్న వైనం దీంతో బయటపడింది. అక్కడ పరిస్థితి ఎంతగా చేయి దాటిందంటే.. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలతో శ్మశాన వాటికల పార్కింగ్ స్థలంలోనూ క్యూ కడుతున్నారు.

Dec 24, a hospital in #Shanghai.#chinacovid #ChinaCovidCases #ChinaCovidSurge #ChinaCovidDeaths #ChinaCovidNightmare #COVID #COVID19 #ZeroCovid #CCPVirus #CCP #China #CCPChina pic.twitter.com/MLC9NxoZNs

— Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) December 27, 2022

శ్మశాన వాటికలలో రిక్రూట్‌మెంట్ ..

షాంఘై నగరంలో కూడా కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఇక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటి పరిస్థితిలో, షాంఘైలోని శ్మశాన వాటికలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. మృత దేహాలను మోసే వ్యక్తులను పెద్ద సంఖ్యలో భర్తీ చేసుకుంటున్నారు. అంతే కాదు.. కరోనా సోకిన వారికి ఈ రిక్రూట్మెంట్లో ప్రాధాన్యత ఇస్తున్నారు.

కరోనాతో చనిపోలేదని లిఖితపూర్వకంగా..

కరోనా మరణాల సమాచారాన్ని దాచేందుకు చైనా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
కరోనాకు సంబంధించిన మరణ గణాంకాలు ప్రపంచం ముందుకు రాకూడదని.. చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మృతుల సంబంధీకులు ఒక ఫారమ్‌పై సంతకం చేశాకే.. వారి బంధువుల మృతదేహాలను ఆసుపత్రి నుండి అందజేస్తున్నారు. ఇందులో ప్రజలు తమ బంధువులు కరోనాతో చనిపోలేదని లిఖితపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తులో  ఏదైనా తప్పు దావా ఉంటే.. దానికి తానే బాధ్యత వహిస్తానని సంతకం చేసే వ్యక్తి పూచీకత్తు ఇవ్వాల్సి వస్తోంది.

శ్మశాన వాటికకు పంపిన నోటీసులో..

ఈ పరిస్థితుల నేపథ్యంలో.. బీజింగ్ లో ఒక శ్మశాన వాటికకు పంపిన నోటీసు కాపీ తాజాగా తెరపైకి వచ్చింది. శ్మశాన వాటికలోని ఏ ఉద్యోగి కూడా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా నిషేధం విధించినట్లు ఆ నోటీసులో రాసి ఉంది. శ్మశాన వాటికకు సంబంధించిన ఏ సమాచారాన్ని కూడా బయటి వారికి చెప్పకుండా నిషేధం విధించారు.

20 రోజుల్లో 25 కోట్ల కేసులు : నివేదిక

చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఇక్కడ గత 20 రోజుల్లో, 25 కోట్ల (250 మిలియన్లు) మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ప్రభుత్వ పత్రాల లీకేజీ తర్వాత ఈ విషయం వెల్లడైంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసు పత్రాలను ఉదహరిస్తూ రేడియో ఫ్రీ ఏషియా కామెంట్ చేసింది.

‘జీరో-కోవిడ్ పాలసీ’లో సడలింపులు ఇచ్చిన తర్వాత..

ఈ నెల మొదటి వారంలో చైనా లో ‘జీరో-కోవిడ్ పాలసీ’లో సడలింపులు ఇచ్చిన తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 20 రోజుల్లో, చైనా అంతటా దాదాపు 250 మిలియన్ల మంది కోవిడ్-19 బారిన పడ్డారు. కరోనా సంక్రమణకు సంబంధించిన డేటాను నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా సమావేశంలో సమర్పించారు.  కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే జరిగిన ఈ భేటీకి సంబంధించిన పత్రాలు లీక్ అయ్యాయి. గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 1 మరియు 20 మధ్య, 248 మిలియన్ల మంది కోవిడ్ -19 బారిన పడ్డారు, ఇది చైనా జనాభాలో 17.65 శాతం.

విధ్వంసం నేపథ్యంలో చైనా ఆంక్షలను ఎత్తివేసింది. చైనాలో కరోనా విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో, అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 8 నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇది మాత్రమే కాదు, చైనా తన అంతర్జాతీయ సరిహద్దులను కూడా తెరవబోతోంది. 2020 నుండి సుమారు 3 సంవత్సరాల తర్వాత చైనా అంతర్జాతీయ నిర్బంధ నిబంధనల నుండిమినహాయించబడుతుంది. గతంలో డిసెంబర్‌లోనే వివాదాస్పద కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకుంటామని చైనా ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. చైనాలో కోవిడ్ పాలసీని ఉపసంహరించుకున్న తర్వాత కేసులు వేగంగా పెరిగాయి.

Telegram Channel

Tags  

  • china
  • corona
  • covid
  • dead bodies

Related News

China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన చైనా.. అంతకంతకు భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా బలపడుతున్న చైనా..

  • Nasal Vaccine : నాసల్ వ్యాక్సిన్ ఎవరికి.. ఎలా వేస్తారు ?

    Nasal Vaccine : నాసల్ వ్యాక్సిన్ ఎవరికి.. ఎలా వేస్తారు ?

  • LockDown: అక్కడ 5రోజులు లాక్ డౌన్.. కరోనా కాదు కానీ?!

    LockDown: అక్కడ 5రోజులు లాక్ డౌన్.. కరోనా కాదు కానీ?!

  • Robbery: సినిమాలకు మించిన ట్విస్ట్: డబ్బు కొట్టేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని పరార్!

    Robbery: సినిమాలకు మించిన ట్విస్ట్: డబ్బు కొట్టేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని పరార్!

  • China Corona : చైనాలో 80 శాతం జనాభాకు కరోనా

    China Corona : చైనాలో 80 శాతం జనాభాకు కరోనా

Latest News

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

  • Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

  • Migraines : మైగ్రేన్ తో డెంటల్ ప్రాబ్లమ్స్ కు లింక్ ఉందా?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: