HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Colombian Lawmaker Among 15 Dead In Plane Crash

మరో విమాన ప్రమాదం, ఎక్కడంటే !!

కొలంబియాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదకర విమాన ప్రమాదంలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు

  • Author : Sudheer Date : 29-01-2026 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Colombian Lawmaker Among 15
Colombian Lawmaker Among 15

బుధువారం బారామతిలోని జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజర్ పవర్ మరణ వార్త నుండి ఇంకా బయటపడకముందే మరో విమాన ప్రమాద వార్త మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. కొలంబియాలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదకర విమాన ప్రమాదంలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆ దేశ శాసనసభ్యుడు డియోజెనెస్ క్వింటెరో మరణించడం రాజకీయంగా పెద్ద లోటుగా పరిణమించింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో సహాయక చర్యలు చేపట్టే లోపే అందరూ మరణించినట్లు తెలుస్తోంది. మృతదేహాలను వెలికితీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రమాదం జరిగిన తీరు అధికారుల సమాచారం ప్రకారం, ఈ విమానం కుకుటాలోని విమానాశ్రయం నుండి బయలుదేరిన కేవలం 9 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమాన నియంత్రణ గదితో సంబంధాలు తెగిపోయాయి. క్వింటెరో బృందం తెలిపిన వివరాల ప్రకారం, విమానంతో కాంటాక్ట్ కట్ అయిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. వెనిజులా సరిహద్దులో ఉన్న ఒక అత్యంత మారుమూల ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. దట్టమైన అటవీ ప్రాంతం లేదా భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Shocking Truths About Ajit

Shocking Truths About Ajit

దర్యాప్తు మరియు విషాద ఛాయలు ఈ ఘటనపై కొలంబియా ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక వాతావరణ పరిస్థితులు కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఒక ప్రజా ప్రతినిధితో పాటు ఇంతమంది పౌరులు మరణించడంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ajit Pawar
  • baramati plane crash
  • colombia plane crash
  • Colombian Lawmaker Among 15 Dead
  • Plane Crashes In Venezuela-Colombia Border

Related News

    Latest News

    • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

    • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

    • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

    • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

    • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd