Saudi Arabia: ఔరా అనిపించేలా కట్టడాలు… వాటికి అరబ్.. కేరాఫ్ అడ్రస్!
ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఆ దేశానికి వెళ్తే ఎక్కడ చూసిన ఇంద్ర
- By Anshu Published Date - 10:44 PM, Mon - 20 February 23

Saudi Arabia: ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఆ దేశానికి వెళ్తే ఎక్కడ చూసిన ఇంద్ర భవనాలే దర్శనమిస్తాయి. ఎక్కువ మంది విదేశీయులు అక్కడ నివసించేందుకు ఇష్టపడుతుంటారు. ఇళ్లు కూడా నిర్మించుకుంటుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ అరబ్ దేశం ఎన్నో ఎన్నో అద్భుతమైన కట్టడాలు పేరొందింది.
సౌదీ అరేబియాలో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. ఆ దేశంలో ఎటుచూసినా అకాశాన్ని తాకే భవనాలు కనిపిస్తాయి. వెరైటీ ప్రాజెక్టులతో ఆశ్చర్యపరిచే ఆదేశం… ఇటీవలే తాబేలు ఆకారంలో భారీ ఓడను నిర్మించేందుకు సిద్ధమైంది. దాన్ని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నా హాలు మొదలుపెట్టింది. దానికి ‘పాంజియోస్’ అని పేరు పెట్టింది.
తాజాగా మరో అబ్బురపరిచే నిర్మాణానికి సౌదీ ప్లాన్ చేసింది. రాజధాని నగరం రియాద్‌లో ‘ముకాబ్’ పేరుతో అతి భారీ కట్టడానికి డిజైన్ చేసింది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అతి భారీ నిర్మాణం.. మక్కాలోని పవిత్ర ‘కాబా’ మాదిరి రియాద్ సిటీలో కనిపిస్తోంది.
సౌదీ విజన్ 2030 ప్రణాళికలో భాగంగా రియాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధునిక డౌన్‌టౌన్‌ను అభివృద్ధి చేయాలని సౌదీ అరేబియా లక్ష్యంగా నిర్దేశించుకుంది. 19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడనుంది. దాదాపు 400 మీటర్లు ఎత్తు ఉండనుంది. ఇది న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 20 రెట్లు పెద్దది.