Whale Harassment : తిమింగలాన్ని వేధించిన మాజీ ప్రెసిడెంట్.. ఎక్కడ ?
Whale Harassment : రాజకీయ కక్ష సాధింపులు ఏ దేశంలో అయినా కామన్.. ఒకేలా ఉంటాయి !!
- By Pasha Published Date - 11:56 AM, Mon - 20 November 23
Whale Harassment : రాజకీయ కక్ష సాధింపులు ఏ దేశంలో అయినా కామన్.. ఒకేలా ఉంటాయి !! అధికారంలో ఉన్న పార్టీ వాళ్లు.. విపక్ష పార్టీల నాయకులను అనవసర ఆరోపణలతో, అనవసర కేసులతో వేధించడం ఏ దేశంలో అయినా ఒకేలా ఉంటుంది!! తాజాగా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు ఇలాంటిదే ఒక విచిత్రమైన కేసు ఎదురైంది. ఈ ఏడాది జూన్‌లో పబ్లిక్ హాలిడే టైంలో బోల్సోనారో తన బోటును నడుపుతూ.. దారిలో అడ్డొచ్చిన ఒక తిమింగలం మీదుగా బోటును డ్రైవ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా ఆ తిమింగలం ఇబ్బందిపడుతుంటే.. అసౌకర్యానికి గురవుతుంటే తన ఫోన్‌లో వీడియో కూడా తీశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి తీసి పోలీసులకు పంపాడు. బోల్సోనారోపై ఓ కన్నేసి ఉంచిన అధికార పార్టీ.. ఇదే అదునుగా ఆయనపై కేసు నమోదు చేయించింది. తిమింగలం పైనుంచి బోటును ఎందుకు నడిపించారంటూ పోలీసులతో విచారణ చేయించింది.
We’re now on WhatsApp. Click to Join.
సముద్ర జలాల్లో తిమింగలాలు, డాల్ఫిన్లు కనిపిస్తే.. బోటులను, ఓడలను కనీసం 100 మీటర్ల దూరం నుంచి నడపాలనేది బ్రెజిల్ ప్రభుత్వం నిబంధన. దీనికి విరుద్ధంగా నడుచుకున్నారనే అభియోగాలను బోల్సోనారోపై నమోదు చేశారు. జలచరాలను పరిరక్షించే ఈ నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తారు. అధికార పీఠం నుంచి దిగినప్పటి నుంచి బోల్సోనారో అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ తిమింగలం కేసు ఎలాంటి చిక్కులను(Whale Harassment) తెచ్చిపెడుతుందో వేచిచూడాలి.