Rishi Sunak: రిషి సునాక్‌ను కోరిన బోరిస్.. ఎందుకో తెలుసా..?
బ్రిటన్ ప్రధాని పదవికి పోరు మరోసారి ప్రారంభమైంది.
- Author : Gopichand
Date : 22-10-2022 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
బ్రిటన్ ప్రధాని పదవికి పోరు మరోసారి ప్రారంభమైంది. ఈ రేసులో పోటీ చేసే అభ్యర్థులకు 100 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది. ఇప్పటికే సునక్‌కు 100 మంది ఎంపీల మద్దతు లభించేసింది. అయితే ఇతర ఎంపీల నుంచి 100 నామినేషన్లు సాధించడంలో ఇతర నేతలు విఫలమైతే సునక్ ఏకగ్రీంగా ప్రధాని పదవిని కైవసం చేసుకుంటారు.
ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత లిజ్ ట్రస్ ప్రధాని పీఠాన్ని సొంతం చేసుకున్నారు. అయితే తన విధానాలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవడంతో అధికారం చేపట్టిన 45 రోజులకే అనూహ్యంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు ట్రస్.
ట్రస్ రాజీనామాతో రిషి సునాక్ మరోసారి ప్రధాని రేసులో నిలిచారు. అయితే.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి ఆ పోస్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రధాని రేసునుంచి తప్పుకోవాలంటూ రిషి సునాక్‌ను కోరినట్లు సమాచారం. కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడం చాలా ముఖ్యమని, ప్రధాని రేసు నుంచి తప్పుకుని తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.