Bus Crash: బస్సులు ఢీ.. 37 మంది మృతి, 39 మందికి గాయాలు
పైగా అక్కడి వాహనదారులు ట్రాఫిక్ నియమాలను(Bus Crash) పెద్దగా పాటించరు.
- By Pasha Published Date - 07:59 AM, Sun - 2 March 25

Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఒకదాన్నొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఒక బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 37 మంది చనిపోగా, 39 మందికి గాయాలయ్యాయి. బొలీవియా దేశంలోని పొటోసీ ప్రాంతంలో ఉన్న ఉయుని(Uyuni)- కొల్చాని రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బస్సును రోడ్డుపై తప్పుడు లేన్‌లో నడిపినందు వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని అధికారులు తెలిపారు. తప్పుడు లేన్‌లోకి ప్రవేశించిన బస్సును, ఎదురుగా వచ్చిన మరో బస్సు ఢీకొట్టిందని చెప్పారు. గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి డెడ్‌బాడీలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించనున్నారు. బొలీవియా దేశంలో పర్వతాలు, కొండలు ఎక్కువ. వాటిపై నిర్మించిన రోడ్లు అంత సక్రమంగా ఉండవు. దీంతో తరుచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. పైగా అక్కడి వాహనదారులు ట్రాఫిక్ నియమాలను(Bus Crash) పెద్దగా పాటించరు. ఈ ఘటనలో ఆవిషయం స్పష్టంగా తెలిసిపోయింది. బొలీవియాలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1400 మంది ప్రాణాలు కోల్పోతుంటారు.
Also Read :Jio Electric Bicycle: ఈవీ రంగంలోకి ముఖేష్ అంబానీ.. ఎలక్ట్రిక్ సైకిల్‌తో ఎంట్రీ!
ఉయుని (Uyuni) నగరంలో తెల్లనేల
బొలీవియాలోని ఉయుని (Uyuni) నగరం చాలా ఫేమస్. ఇక్కడికి ఏటా వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. ఉయుని నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నేల వైట్ కలర్‌లో ఉంటుంది. దీనికి కారణం నేలలోని ఉప్పు ధాతువు, ఖనిజాలు. సూర్యకిరణాలు పడగానే ఇక్కడి నేల తెల్లగా మెరిసిపోతుంది. ఉయుని ప్రాంతంలో క్వినోవా పంట సాగు, లామా జంతువుల పెంపకం, గొర్రెల పెంపకం అనేవి ప్రజలకు ప్రధాన జీవనాధారాలు.
Also Read :New Party : తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడా..?
బొలీవియా పేరుకు పెద్ద చరిత్ర
బొలీవియా దేశం పేరు విషయానికి వస్తే.. పెద్ద చరిత్రే ఉంది. వెనెజులాకు చెందిన నేత సైమన్ బొలీవర్ గౌరవార్ధం ఈ దేశానికి బొలీవియా అని పేరు పెట్టుకున్నారు. స్పానిష్ అమెరికన్ యుద్ధాలు జరిగిన టైంలో సైమన్ బొలీవర్ బొలీవియా ప్రాంతాన్ని నియంత్రించేవాడు. ఆయనకు నాటి వెనెజులా పాలకులు రెండు ఆప్షన్లు ఇచ్చారట. ‘‘మీ నియంత్రణలో ఉన్న చార్కస్ (ప్రస్తుత బొలీవియా) ప్రాంతాన్ని పెరూ దేశంలో కలపండి. లేదంటే దాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయండి’’ అనేవి ఆ ఆప్షన్లు. వీటిలో ప్రత్యేక దేశం ఏర్పాటు ఆప్షన్‌కే సైమన్ బొలీవర్ మొగ్గుచూపారు. అందుకే ఈ దేశానికి ఆయన పేరు పెట్టారు. తొలుత ఈ దేశానికి ‘రిపబ్లిక్ ఆఫ్ బొలీవర్’ అని పేరు పెట్టారు. రొములస్ అనే పాలకుడి పేరిట రోమ్ నగరం ఏర్పడింది. బొలీవర్ పేరిట ఏర్పడిన దేశం పేరు కాలక్రమంలో బొలీవియాగా మారింది.