HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Teenmar Mallanna New Party

New Party : తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నాడా..?

New Party : బీసీ హక్కుల కోసం తనదైన శైలిలో గళమెత్తుతూ వచ్చిన మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది

  • Author : Sudheer Date : 01-03-2025 - 10:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mallanna New Party
Mallanna New Party

Teenmar Mallanna New Party : తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)ను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీసీ హక్కుల కోసం తనదైన శైలిలో గళమెత్తుతూ వచ్చిన మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, కులగణన సర్వే రిపోర్టును కాల్చిన వ్యవహారం తీవ్ర దుమారం రేపాయి. దీంతో, పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తికి లోనై ఆయనను పార్టీ నుంచి తొలగించింది. అయితే, మల్లన్న తన రాజకీయ భవిష్యత్‌ కోసం కొత్త పార్టీ (Teenmar Mallanna New Party) ఏర్పాటు చేసే అవకాశముందా? లేదా మరో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బీసీ నినాదంతో కొత్త పార్టీ స్థాపన..?

తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా బీసీ సంక్షేమాన్ని ముందుంచుకుని బలమైన వాదనలు చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, వారి హక్కుల కోసం బీసీలంతా ఐక్యంగా రావాలంటూ ఆయన పదేపదే చెబుతున్నారు. దీనికి తోడు బీసీ నేతలు ఆర్. కృష్ణయ్య, వట్టే జానయ్య కూడా అవసరమైతే బీసీలంతా కలిసి ఓ కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొనడం, మల్లన్న కూడా ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని బలపరుస్తున్నాయి. మల్లన్న సస్పెన్షన్ తర్వాత, అతని మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకముందే బీసీ సంఘాల నాయకులతో చర్చించి తీరాలని మల్లన్న భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ లేదా టీడీపీ వైపు మల్లన్న మొగ్గు చూపనున్నారా?

తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రస్థానం చూస్తే.. గతంలో బీజేపీలో చేరి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు అడుగులు వేయవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. మరోవైపు తెలంగాణలో టీడీపీ తిరిగి పునాది వేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా, పార్టీకి బలమైన నేతలు లేకపోవడంతో, మల్లన్నను ఆ పార్టీ ఆకర్షించే అవకాశముందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ బీసీలకు అనుకూలమైన పార్టీగా పేరుపొందడం, రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఖాళీగా ఉండడం కూడా మల్లన్నకు కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు. మొత్తానికి తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగుల గురించి తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి మల్లన్న ఏ నిర్ణయం తీసుకున్నారో..!

TPL : టీపీఎల్‌కు బీసీసీఐ అనుమతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress party
  • mallanna Party name
  • Mallanna suspend
  • MLC Mallanna
  • teenmar
  • Teenmar Mallanna
  • teenmar mallanna Latest News
  • teenmar mallanna New Party

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • A New Look for the Kaleswaram Temple

    Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd