Indonesia Boat Fire: 240మంది ప్రయాణీకులతో వెళ్తోన్న పడవలో మంటలు.. 14 మంది సజీవదహనం.!!
ఇండోనేషియాలో విషాదం నెలకొంది. దక్షిణ ఇండోనేషియాలో 240మంది ప్రయాణీకులతో వెళ్తోన్న పడవలో మంటలు చెలరేగాయి.
- Author : hashtagu
Date : 26-10-2022 - 4:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండోనేషియాలో విషాదం నెలకొంది. దక్షిణ ఇండోనేషియాలో 240మంది ప్రయాణీకులతో వెళ్తోన్న పడవలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. KM ఎక్స్‌ప్రెస్ Cantica-77 అనే పడవ తూర్పు నుసా టెంగ్ గారా ప్రావిన్స్లోని కుపాంగ్ నుంచి కలాబాయి వైపు ప్రయాణిస్తోంది. పడవలో మంటలను గుర్తించిన రెస్య్కూ టీం…సమీపంలోని ఓడల ద్వారా 226మంది రక్షించాయి. 14మంది మరణించినట్లు నిర్దారించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Hundreds rescued from Indonesia boat firehttps://t.co/mPJlOAPeIW pic.twitter.com/1YOcR2x4oM
— BBC News (World) (@BBCWorld) October 25, 2022